AP News: 4 కి.మీ. డోలీలో గర్భిణి

తాజా వార్తలు

Published : 05/08/2021 01:49 IST

AP News: 4 కి.మీ. డోలీలో గర్భిణి

చింతపల్లి: కాబోయే తల్లులకు మ‌న్యంలో క‌ష్టాలు, క‌న్నీళ్లు నిత్య‌కృత్యంగా మారాయి. మ‌న్యంలో డోలీ మోత‌ల‌కు స్వ‌స్తి ప‌లికేందుకుగానూ ప్ర‌స‌వానికి వారంరోజులు ముందే గ‌ర్భిణుల‌ను స‌మీప ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించాల‌ని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేస్తున్నా ఇవి క్షేత్ర‌స్థాయిలో స‌క్ర‌మంగా అమ‌లు కావ‌డంలేదు.తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. విశాఖ మ‌న్యంలోని తోకపాడుకు చెందిన గర్భిణిని ఆసుపత్రికి చేర్చేందుకు ఆమెను డోలీలో ఉంచి.. కొండ ప్రాంతం నుంచి ఏకంగా నాలుగు కిలోమీట‌ర్లు ప్రయాణించి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

చింత‌ప‌ల్లి మండ‌లం బలపం పంచాయతీ తోకపాడుకు చెందిన కూసంగి చంద్రమ్మ(22)కు నెలలు నిండటంతో మంగళవారం రాత్రి నుంచి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తోకపాడు గ్రామం నుంచి రోడ్డు పాయింట్‌కి వెళ్లాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలో దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉన్న కొండ ఎక్కాలి. చంద్రమ్మది మొదటి కాన్పు కావడంతో ఆశా కార్యకర్త గ్రామస్థులను అప్రమత్తం చేశారు. దీంతో బుధవారం ఉదయం చంద్రమ్మను డోలీలో ఎక్కించుకొని రోడ్డు పాయింట్‌కి తరలించారు. సుమారు నాలుగు కిలోమీటర్లు ఉన్న కొండ ఎక్కి అతి కష్టం మీద బ‌ల‌పం రోడ్డు పాయింట్‌కి ఆమెను మోసుకువచ్చారు. అక్కడి నుంచి లోతుగెడ్డ పీహెచ్‌సీకి త‌ర‌లించేందుకు అంబులెన్‌కు ఫోన్ చేస్తే ఆ ప్రాంతానికి వచ్చేందుకు ఆల‌స్యమవుతుంద‌ని చెప్ప‌డంతో ఓ ఆటోలో లోతుగెడ్డ  పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.  తమ గ్రామానికి రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తోకపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని