తిరుమలలో గదుల బుకింగ్‌ మరింత సులభం
close

తాజా వార్తలు

Published : 10/06/2021 17:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమలలో గదుల బుకింగ్‌ మరింత సులభం

తిరుమల: తిరుమలలో అద్దె గదుల కోసం సాధారణ భక్తులకు ఇక్కట్లు తప్పనున్నాయి. గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు ఆరు చోట్ల రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జీఎన్‌సీ, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రామ్‌ భగీచ, ఎంబీసీ, సీఆర్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా గదుల సమాచారం చేరుతుంది. ఎస్‌ఎంఎస్‌ వచ్చిన వెంటనే భక్తులు నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8గంటలకు రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను తితిదే అధికారులు ప్రారంభించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని