ఆమె.. స్వీపర్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి..!

తాజా వార్తలు

Published : 15/07/2021 18:26 IST

ఆమె.. స్వీపర్‌ నుంచి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి..!

జైపుర్‌: ఆమె చేసేది మున్సిపల్‌ కార్యాలయంలో చిన్న స్వీపర్‌ ఉద్యోగం. వీధులు ఊడ్చే పని చేస్తూనే ఉన్నత లక్ష్యం వైపు ఆమె అడుగులు వేసింది.  పట్టుదలతో శ్రమించి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకుంది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో స్వీపర్‌గా  ఆశా పని చేస్తోంది. ఆమె రెండేళ్ల క్రితం రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ పరీక్ష రాసింది. తాజాగా వెలువడిన ఆ పరీక్ష ఫలితాల్లో తాను ఉత్తీర్ణత సాధించినట్లు తెలుసుకొని సంతోషం వ్యక్తం చేసింది. ప్రభుత్వం త్వరలో ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇవ్వనుంది. ఆశా ఎనిమిదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. తన ఇద్దరు పిల్లలను పోషిస్తూనే ఆమె డిగ్రీ చదువు పూర్తి చేసింది.  పట్టుదలతో శ్రమించి తన లక్ష్యాన్ని సాధించింది. 


    


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని