TS news: జులైలో ఇంటర్‌ పరీక్షలు?

తాజా వార్తలు

Updated : 27/05/2021 17:28 IST

TS news: జులైలో ఇంటర్‌ పరీక్షలు?

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తన అభిప్రాయాలను తెలిపింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శికి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి లేఖ రాశారు. కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జులై మధ్యలో నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. పరీక్ష సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరకు తగ్గించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్షా విధానాన్ని మార్చలేమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రశ్నపత్రంలోని సగం ప్రశ్నలకే సమాధానాలు రాసేందుకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పింది. కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మరోసారి నిర్వహిస్తామని, ఫలితాలను ఆగస్టు నెలాఖరులో వెల్లడిస్తామని రాష్ట్ర విద్యాశాఖ కేంద్రానికి తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని