AP News: కృష్ణా నదిలో చిక్కుకున్న లారీలు.. ఎట్టకేలకు బయటకు తీసిన అధికారులు

తాజా వార్తలు

Published : 15/08/2021 15:00 IST

AP News: కృష్ణా నదిలో చిక్కుకున్న లారీలు.. ఎట్టకేలకు బయటకు తీసిన అధికారులు

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో చిక్కుకుపోయిన లారీలను అధికారులు ఎట్టకేలకు బయటకు తీశారు. నిన్న ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో నదిలో ఇసుక కోసం వెళ్లిన లారీలు పెద్ద సంఖ్యలో వరదలో చిక్కుకుపోయాయి. అకస్మాత్తు వరదతో రహదారి కూడా కొంతమేర దెబ్బతింది. దీంతో లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితిలో అక్కడే నిలిచిపోయాయి. ఇవాళ క్రేన్లు, యంత్రాల సాయంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు లారీలను బయటకు తీశాయి. మొత్తం 132 లారీలు.. 4 ట్రాక్టర్లను బయటకు తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని