close

తాజా వార్తలు

Updated : 12/04/2021 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. నిమిషాల్లో రూ. 6.86లక్షల కోట్ల సంపద ఆవిరి

కరోనా రెండో దశ ఉద్ధృతి, లాక్‌డౌన్‌ భయాలతో దేశీయ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  సెన్సెక్స్‌ ఏకంగా 1500 పాయింట్లు పతనమవగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ కూడా 14,500 దిగువకు పడిపోయింది. సూచీల నష్టాలతో కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ. 6.86లక్షల కోట్ల మేరకు ఆవిరైంది. ఉదయం సెషన్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 1479.15 పాయింట్లు కోల్పోయింది. దీంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6,86,708.74కోట్లు తగ్గి రూ. 2,02,76,533.13కోట్లకు చేరింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఓరుగల్లులో మిషన్‌ భగీరథ ప్రారంభం

వరంగల్‌ ప్రజల దాహార్తిని తీర్చే ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకాన్ని ఉగాది కానుకగా మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల ముంగిట ఆయన వరంగల్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా కాజీపేట రాంపూర్‌కు చేరుకున్న కేటీఆర్‌ వరంగల్‌ నగర వాసులకు ప్రతి రోజు స్వచ్ఛమైన నీరు అందించే మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం రూ.939 కోట్లు వ్యయం కాగా.. అమృత్‌ పథకం కింద రూ.413 కోట్లు ఖర్చు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయం లేదు: శివసేన

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మహారాష్ట్రకు తగినన్ని టీకాలు సరఫరా చేయడం లేదంటూ కేంద్రంపై శివసేన మండిపడింది. రాష్ట్రాన్ని భాజపా పాలించకపోయినంత మాత్రన ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి అని ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ సోమవారం తన అధికార పత్రిక ‘సామ్నా’లో విమర్శలు చేసింది. ‘కేంద్రం మహారాష్ట్రకు తగినన్ని టీకాలు సరఫరా చేయాలి. టీకా ఉత్సవ్‌లో భాగంగా రాష్ట్రానికి టీకాలు అందించి ఆదుకోవడం కేంద్రం విధి. రాష్ట్రానికి చెందిన భాజపా నాయకులు సైతం ఇక్కడి పరిస్థితులను దిల్లీలోని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలి’ అని సామ్నా పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. సుప్రీంకోర్టులో 50% సిబ్బందికి కరోనా!

భారత్‌లో మరోసారి పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా తీవ్ర ప్రభావం చూపించింది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు దాదాపు 50శాతం మంది సిబ్బంది కొవిడ్‌ బారినపడినట్లు ఆంగ్ల వార్తాసంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి. శనివారం ఒక్కరోజే 44 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు మళ్లీ వర్చువల్‌ విధానంలో కేసుల విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వర్గాలు వెల్లడించాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5.హారికా నారాయణ్‌.. సింగర్‌ మాత్రమే కాదు..

‘లాహే లాహే లాహే లాహే’.. గత కొన్నిరోజుల నుంచి ఎక్కడా విన్నా.. ఎవరి ఫోన్‌లో చూసిన ఇదే పాట వినపడుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’లోని ఈ పాట గాయని హారికను మరెంతో మంది సినీప్రియులకు చేరువచేసింది. చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకున్న ఆమె ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘స్వరాభిషేకం’తో గాయనిగా వెలుగులోకి వచ్చింది. అనంతరం వరుస స్టేజ్‌ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో హారికా నారాయణ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. వాలంటీర్లు నిస్వార్థంగా పని చేస్తున్నారు: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు కులాలు, మతాలు చూడకుండా నిస్వార్థంగా పని చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రశంసించారు. వైకాపా ప్రభుత్వం  ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో భాగంగా ఉత్తమ సేవలందించిన వారిని సత్కరించే కార్యక్రమానికి జగన్‌ ఇవాళ శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను సీఎం అందజేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటనలో కొత్తకోణం

విజయవాడలోని గొల్లపూడిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో హోంగార్డే భార్యపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగంలోని ఏఎస్పీ శశిభూషణ్‌ వద్ద హోంగార్డు వినోద్‌కుమార్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం శశిభూషణ్‌ అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకీని హోంగార్డు వద్ద ఉంచారు. దాన్ని హోంగార్డు ఇంటికి తీసుకువచ్చాడు. మొదట ఇంట్లో తుపాకీ మిస్‌ఫైర్‌ అయినట్లు హోంగార్డు చెప్పాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కేంద్రం ఆహ్వానిస్తే చర్చలకు సిద్ధమే: టికాయిత్‌

నూతన సాగు చట్టాల విషయంలో కేంద్రం ఆహ్వానిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. జనవరి 22న కేంద్రం చర్చల్ని ఎక్కడైతే నిలిపివేసిందో.. తిరిగి అక్కడి నుంచే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. కరోనా కల్లోలం: బ్రెజిల్‌ను దాటేసిన భారత్

నిత్యం లక్షకుపైగా కొత్త కేసులతో భారత్‌లో కరోనా వైరస్ బుసలు కొడుతోంది. తాజాగా 1,68,912 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 1,35,27,717కి చేరింది. ఫలితంగా అమెరికా తరవాత వైరస్‌ కల్లోలానికి తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానానికి చేరింది. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. మొత్తం కేసులపరంగా చూస్తే అమెరికాలో 3,19,18,591 మందికి కరోనా సోకింది. భారత్‌లో ఆ సంఖ్య కోటీ 35లక్షల మార్కును దాటగా.. బ్రెజిల్ తరవాత స్థానంలో ఉంది. ఆ దేశంలో 1,34,82,543 మంది మహమ్మారి బారినపడ్డారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

* టీఎస్‌ కరోనా : 2251 కేసులు.. 6 మరణాలు

10. గుర్తుందా.. సిక్సర్ల జడివాన

216.. ఐపీఎల్‌లో అప్పటి వరకు అత్యధిక చేధన ఇదే. దాన్ని సాధించడమే గొప్ప. అలాంటింది 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తారని ఎవరైనా అనుకుంటారా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది రాజస్థాన్‌ రాయల్స్‌. అదీ మరో 3 బంతులు మిగిలుండగానే. గెలుపు ధీమాతో ఉన్న పంజాబ్‌ను మట్టికరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గెలుపోటములను పక్కన పెడితే ఆనాడు షార్జా సిక్సర్ల జడివానకు తడిచి ముద్దైంది. పరుగుల వరదకు సాక్ష్యంగా మారింది. అభిమానులను మైమరపించింది. తాజాగా ఆ రెండు జట్లు తలపడుతున్న నేపథ్యంలో 2020లో ఏం జరిగిందో ‘రివైండ్‌’ చేసుకుందామా? మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని