Seeds: నకిలీ విత్తనాలకు క్యూఆర్‌ కోడ్‌తో చెక్‌!

తాజా వార్తలు

Published : 27/06/2021 01:10 IST

Seeds: నకిలీ విత్తనాలకు క్యూఆర్‌ కోడ్‌తో చెక్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్కెట్లో వందలాది కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న తరుణంలో ఏది అసలు, ఏది నకిలీనో తెలియక చాలా మంది రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలవడంతో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. ప్రతిరోజూ టన్నుల కొద్దీ నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. కాగా ఈ నకిలీలకు సాంకేతికతతో చెక్ పెడుతున్నాయి విత్తన కంపెనీలు. క్యూఆర్‌ కోడ్ పరిజ్ఞానంతో విత్తనాలు అసలు కంపెనీవా లేక నకలీవా తెలుసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

లైసెన్స్‌ కలిగిన విత్తన సంస్థలు విత్తన ప్యాకెట్‌పై ఓ క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తున్నాయి. ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ విత్తనాలు కంపెనీవా? కాదా? అనే విషయాన్ని రైతు చరవాణికి సంక్షిప్త సందేశం వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కంపెనీ సమాచారం, విత్తనాల కాల పరిధి, దాని ధర సహా పలు విషయాలు స్కాన్‌ చేసిన రైతు చరవాణికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో నకిలీ విత్తనాలకు చెక్‌ పెట్టొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా దీనిపై రైతులకు మరింత అవగాహక కల్పించాల్సివుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రకారం.. విత్తన కంపెనీలు విత్తన ప్యాకెట్లపై ఇలాంటి క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించాలనే నిబంధన కూడా అమల్లోకి రానుంది. అది పూర్తిస్థాయిలో అమలైతే రైతులకు మరింత మేలు జరుగుతుందని, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే అవకాశాలున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని