ప్రధానాంశాలు

Published : 14/06/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చారిత్రక ప్రదేశాల సందర్శకులకు కేంద్రం గుడ్‌న్యూస్

దిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను ఈ నెల 16 నుంచి తెరవనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు భారత పురావస్తుశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొవిడ్‌ రెండో దశ ప్రారంభమై భారీగా కేసులు పెరగడంతో అప్రమత్తమైన కేంద్రం.. స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను ఏప్రిల్‌ 15నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం దేశంలో వైరస్‌ కేసులు తగ్గుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లను సడలిస్తూ సాధారణ జీవనానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు, వ్యాక్సినేషన్‌ కూడా కొనసాగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  జూన్‌ 16 (బుధవారం) నుంచి కేంద్ర సంరక్షణలో ఉన్న  చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను తిరిగి తెరవాలని నిర్ణయించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సందర్శకులు ఆయా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ట్విటర్‌లో పేర్కొన్నారు.


1404345272495349762

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net