ప్రధానాంశాలు

Published : 15/05/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Bumrah:నా కెరీర్ ఎదుగుదలకు ఆయనే కారణం

(photo: Jasprit Bumrah Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: జస్ప్రీత్ బుమ్రా... ఇన్‌ స్వింగ్, ఔట్ స్వింగ్, బౌన్సర్‌, యార్కర్ ఇలా ఏ రకమైన బంతులనైనా అలవోకగా సంధించగల సామర్థ్యం ఉన్న బౌలర్‌. అందుకే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఉత్తమమైన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. అయితే, తన కెరీర్‌ ఎదుగుదలలో న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ షేన్‌ బాండ్ ప్రధాన పాత్ర పోషించాడని ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు. ఆ జట్టు(ముంబయి) కోచ్‌గా షేన్‌బాండ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కాగా, షేన్‌బాండ్‌తో తనకున్న అనుబంధం గురించి బుమ్రా మాట్లాడిన వీడియోని ముంబయి ఇండియన్స్‌ శుక్రవారం ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో షేన్‌బాండ్, ట్రెంట్‌ బౌల్ట్‌, ఆడమ్‌ మిల్నె, జిమ్మీ నీషమ్‌ కూడా మాట్లాడారు.

‘నేను షేన్‌బాండ్‌ని మొదటిసారిగా 2015లో కలిశాను. నా చిన్నప్పటి నుంచే అతని బౌలింగ్‌ని చూస్తున్నా. నా బౌలింగ్‌ జట్టుకు ఎలా ఉపయోగపడుతుందా? అని ఎప్పుడూ  ఆలోచిస్తూ అందుకు తగినట్టుగా బౌలింగ్ చేసేవాడు. నేను క్రికెటర్‌గా రాణించడానికి  ఎంతో సహకరించాడు. ఆయనను కలవడం మంచి అనుభవం. మైదానంలో  ప్రయత్నించే విభిన్న కోణాలపై సూచనలిస్తూ సహకరించేవాడు. నేను ఎక్కడ ఉన్నా, భారత జట్టుతో ఉన్నప్పుడు కూడా బాండ్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఆయనతో ఉన్న అనుబంధం ప్రతి సంవత్సరం మెరుగవుతోంది. ఈ అనుబంధం మరిన్ని సంవత్సరాలు కొనసాగాలి.  ప్రతి సంవత్సరం ఆయన నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటా. వాటిని నా బౌలింగ్‌లో ప్రదర్శించడానికి ప్రయత్నిస్తా’ అని బుమ్రా అన్నాడు.

బుమ్రా ప్రపంచంలోనే ఉత్తమ డెత్ బౌలర్‌ అని షేన్‌బాండ్ కొనియాడాడు. కాగా, జూన్‌ 18-22 మధ్య సౌథాంప్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ జరగనుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో భారత్‌ ఐదు టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు బీసీసీఐ ఇప్పటికే 20మందితో కూడిన జట్టును ప్రకటించింది. టీమిండియా పేస్‌దళానికి బుమ్రా నాయకత్వం వహించనున్నాడు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net