close

తాజా వార్తలు

Published : 05/07/2020 03:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో ఉచితంగా 10 కిలోల బియ్యం

రేపటి నుంచే పంపిణీ చేస్తాం: మంత్రి గంగుల

హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి నుంచి నిరు పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం  పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. ప్రధాని మోదీ నవంబర్‌ వరకు ప్రకటించిన 5కిలోలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు ఇస్తుందని తెలిపారు. కేంద్రం కేవలం ఆహార భద్రతా కార్డుదారులకే ఇస్తుందన్న మంత్రి..  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేషన్‌ లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తుందని చెప్పారు 

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థితిలేకపోవడంతో ప్రధాని మోదీ జులై నుంచి నవంబర్‌ వరకు ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. పేదలకు 5 కిలోలు సరిపోవు. అందుకే ఉచితంగా 10కేజీలు ఇవ్వాలని సీఎం చెప్పారు. అందువల్ల రేపటి నుంచి రాష్ట్రంలో బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు 2,79,81000 మంది లబ్ధిదారులను నిరుపేదలుగా గుర్తించాం. ఈ పంపిణీతో రాష్ట్ర ఖజానాపై రూ.250 కోట్లు అదనపు భారం పడనుంది’’ అని చెప్పారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని