
తాజా వార్తలు
మొత్తం 4 కోట్లు.. 75 లక్షల మంది స్వస్థలాలకు
దిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు నాలుగు కోట్ల మంది పనుల నిమిత్తం వలస వెళ్లారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. గత జనాభా లెక్కల ప్రకారం ఈ అంచనాలు వెలువరించింది. అందులో లాక్డౌన్ అనంతరం సుమారు 75 లక్షల మంది బస్సుల్లోనూ, రైళ్లలోనూ తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారని తెలిపింది. 35 లక్షల మంది శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో వెళ్లగా.. మరో 40లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారని హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాత్సవ వెల్లడించారు. వలస కార్మికుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో లాక్డౌన్ అనంతరం వలస కూలీల సంక్షేమం, వారి తరలింపునకు చేపట్టిన చర్యలు ఆమె మాటల్లోనే..
- లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను ఎక్కడికీ వెళ్లకుండా చూసుకోవాలని, వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని మార్చి 27న అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చాం. వారికి ఆహారం, వసతి కల్పించాలని చెప్పాం.
- వారికి అవసరమయ్యే ఆహారం, వసతి కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) వినియోగించుకునేలా రాష్ట్రాలు/ యూటీలకు అనుమతిస్తూ మార్చి 28న ఉత్తర్వులు జారీ చేశాం.
- ఎన్డీఆర్ఎఫ్ కింద ఏప్రిల్ 3న రూ.11,092 కోట్లు రాష్ట్రాలు/యూటీలకు విడుదల చేశాం.
- వలస కార్మికుల సమస్యల కోసం కేంద్ర స్థాయిలో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. అదే తరహాలో ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు ఆదేశించాం.
- ఆహారం, వసతి గురించి మరోమారు రాష్ట్రాలకు ఆదేశాలిచ్చాం.
- వలస కూలీల తరలింపునకు ట్రక్కుల వినియోగంపై నిషేధం విధించాం.
- సొంత రాష్ట్రంలోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏప్రిల్ 19న ఉత్తర్వులు ఇచ్చాం.
- అంతర్రాష్ట్ర ప్రయాణాలకు మే 1న అనుమతులిచ్చాం. మొత్తం 2,600 శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో 35 లక్షల మందిని తరలించాం.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
