భువనగిరి రైతు ఖాతాలో రూ.473 కోట్లు
close

తాజా వార్తలు

Published : 13/12/2020 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భువనగిరి రైతు ఖాతాలో రూ.473 కోట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖాతాలో బ్యాంకు బ్యాలెన్స్‌ వివరాలు చూసి ఓ రైతు విస్మయానికి గురయ్యాడు. నగదు తీసుకునే ప్రయత్నం చేయగా ఏకంగా రూ.473 కోట్లకు పైగా నగదు నిల్వ ఉన్నట్లు రసీదు వచ్చింది. అంత డబ్బు తన ఖాతాలో చూసిన రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన రైతు అనుమూల సంజీవరెడ్డికి భువనగిరిలోని దక్కన్‌ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు వెళ్లిన సంజీవరెడ్డి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ డబ్బు రాకపోవడంతో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నాడు. కాగా తన ఖాతాలో రూ.473,13,30,000 ఉన్నట్లు రసీదు వచ్చింది. ఎస్‌బీఐ ఏటీఎంలో చూసుకున్నా అంతే బ్యాలెన్స్‌ చూపించింది. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన రైతు భువనగిరి దక్కణ గ్రామీణ బ్యాంకును సంప్రదించగా అధికారులు అసలు విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఖాతా పనిచేయడం లేదని, ఏటీఎం సర్వీసు సమస్యలు తలెత్తాయని అధికారులు సమాధానమిచ్చారు. ఖాతాలో రూ.4 వేలే ఉన్నాయని వెల్లడించారు.

ఇదీ చదవండి..

₹200 ఖర్చు.. లక్షధికారి అయిన రైతు..!
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని