close

తాజా వార్తలు

Published : 30/11/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

50 కుటుంబాలు..50 గంటల పాటు... 

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాభై గంటలు, యాభై కుటుంబాలు.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరద నీరు చుట్టుముట్టి బయటకు వచ్చేందుకు ఆస్కారం లేని పరిస్థితుల్లో ఇక ప్రాణాలు పోతాయనుకున్నారు. రెండు రోజుల పాటు దిక్కు తోచని స్థితి ఉన్న వేళ అగ్నిమాపక శాఖ ఆ కుటుంబాలను కాపాడింది. వివరాల్లోకి వెళ్తే.. కడప శివారులోని గుర్రంగుంపు తండాలో దాదాపు యాభై గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి... నివర్‌ ప్రభావంతో బుగ్గవంక డ్యాం నిండిపోగా అధికారులు నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా ఆ నీరు గుర్రంగుంపు తండాను చుట్టుముట్టింది. దాంతో స్థానికులు చెట్లపై, నివాసాల్లో తల దాచుకున్నారు. రెండు రోజులు తరువాత ఈ విషయం అగ్నిమాపక శాఖ వారికి తెలిసింది. వెంటనే తండా వద్దకు వెళ్లి బోట్ల సాయంతో అందరినీ ఒడ్డుకు చేర్చారు. తమను కాపాడినందుకు అగ్నిమాపక శాఖ సిబ్బందికి తండా వాసులు ధన్యవాదాలు తెలిపారు.Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన