close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 26/05/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఏపీలో మరో48 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,148 మంది నమూనాలు పరీక్షించగా.. 48 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,719  కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 57కు చేరింది. కరోనా నుంచి కోలుకుని కొత్తగా 55 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన  వారి సంఖ్య 1903కి చేరింది. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

2. సెలెక్ట్‌ కమిటీ వేయాలని హైకోర్టులో పిటిషన్‌

వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శాసనమండలి తీర్మానం చేసినా కమిటీ ఏర్పాటు చేయడం లేదన్నారు. ఈ విషయంలో  కౌన్సిల్‌ కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మండలి ఛైర్మన్‌ ఆదేశాలను కార్యదర్శి ఉల్లంఘించారన్న దీపక్‌రెడ్డి.. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘నాకది..నీకిది’ కింద మండలి కార్యదర్శి పదవీకాలాన్ని పొడిగించారని పిటిషన్‌లో వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదిరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటు భారత్‌.. అటు చైనా తమ తమ భూభాగాల్లో బలగాల్ని పెంచుకునే యోచనలో ఉన్నాయి. 2017లో డోక్లాం తరహా వివాదానికి దారితీసే అవకాశాలున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే డ్రాగన్‌ దాదాపు 2000-2500 మంది సైనికుల్ని సరిహద్దుకు చేర్చినట్లు తెలుస్తోంది. ఇటు భారత్‌ కూడా వివాదాస్పదంగా ఉన్న పాంగాంగ్‌, గాల్వన్‌ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంట బలగాల్ని పెంచుకున్నట్లు ఓ సైనిక ఉన్నతాధికారి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘కరోనా’ విపత్తుపై యునిసెఫ్‌కు విశాఖ బాలుడి ప్రశ్న

5. లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం విఫలం: రాహుల్‌

లాక్‌డౌన్‌ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...లాక్‌డౌన్‌ ఉద్దేశం, లక్ష్యం నెరవేరలేదని ఆరోపించారు. వైరస్‌ తగ్గుముఖం పడుతుందని కేంద్రం చెబుతోంది... కానీ కేసులు ఇంకా పెరుగుతున్నాయన్నారు. కరోనా కేసులు పెరుగుతుంటే ..మరో వైపు లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కరోనా వైరస్‌పై ఒంటరి పోరాటం చేశామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత సంతతి వ్యక్తికి ప్రతిష్ఠాత్మక అవార్డు

భారత సంతతికి చెందిన అమెరికన్‌ రాజీవ్ జోషిని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఎలక్ట్రానిక్‌, కృత్రిమ మేధ రంగాల్లో అందించిన సేవలకుగానూ ఆయనకు ‘ఇన్వెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం దక్కింది. జోషి ప్రస్తుతం న్యూయార్క్‌లోని ‘ఐబీఎం థామ్సన్‌ వాట్సన్‌ రీసెర్చ్‌ సెంటర్‌’లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన పేరు మీద 250 పేటెంట్లు ఉన్నాయి. ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన జోషి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)నుంచి ఎం.ఎస్‌ పట్టా పొందారు. అనంతరం కొలంబియా విశ్వవిద్యాలయంలో మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టీవీఎస్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తమ కంపెనీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. అయితే, ఇది ఉన్నతస్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. మే నుంచి అక్టోబర్‌ వరకు ఈ కోత అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌-19 వల్ల ఏర్పడ్డ అనుకోని సంక్షోభం వల్లే ఆరు నెలల పాటు వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. కార్మికస్థాయి ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులకు ఐదు శాతం, యాజమాన్య స్థాయి ఉద్యోగులకు 15-20 శాతం వేతనాన్ని తగ్గించి ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌కు సాయం కొనసాగుతుంది: చైనా

కరోనా వైరస్‌ మహమ్మారిపై చేస్తున్న పోరులో భారత్‌కు సాయం కొనసాగుతుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. వైరస్‌పై పోరులో సహకారం, సంఘీభావం ఎంతో కీలక ఆయుధాలుగా పనిచేస్తాయని భారత్‌లోని చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా భారత్‌కు చైనా సహకారం కొనసాగుతుందన్నారు. చైనాలోని జాక్‌మా, అలీబాబా ఫౌండేషన్లు భారత్‌కు ప్రకటించిన విరాళంలో భాగంగా రెండో దఫా వెంటిలేటర్లు, పీపీఈ కిట్లతో పాటు ఇతర వైద్య సామగ్రి దిల్లీకి చేరుకుందని వీడాంగ్‌ వెల్లడించారు. అయితే, తాజాగా భారత్‌లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడున్న చైనీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చైనా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సచిన్‌ పెళ్లిరోజు.. స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఏంటంటే...

తన 24 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్.. సోమవారం మరో మైలురాయి చేరుకున్నారు. అయితే ఈసారి క్రికెట్‌ మైదానంలో కాదు.. తన వ్యక్తిగత జీవితంలో కావటం విశేషం. తన కలలరాణి అంజలీతో సచిన్ వివాహమై నిన్నటికి 25 ఏళ్లు. దీంతో వివాహ వార్షికోత్సవాన్ని ఇంట్లోనే ప్రత్యేకంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సచిన్‌ మామిడి పండుతో కుల్ఫీని స్వయంగా తయారు చేసి తన కుటుంబసభ్యులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
10. లాక్‌డౌన్‌ తర్వాత ఆ సన్నివేశాలకు దూరం

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై వరుస అవకాశాలను దక్కించుకుంటున్న నటి లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడటంతో ఇంట్లోనే ఉంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  లాక్‌డౌన్‌, కొవిడ్‌-19 తర్వాత రొమాంటిక్‌ సన్నివేశాలకు కాస్త దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. ‘‘లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు మొదలైనప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. సెట్స్‌లో అయితే భద్రతకే మొదటి ప్రాధాన్యం. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తాం. ఇక రొమాంటిక్‌ సన్నివేశాలకు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా’’ అని లావణ్య త్రిపాఠి చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.