close

తాజా వార్తలు

ఇప్పుడే అవసరం లేదు..

విద్యుత్తు బస్సుల టెండర్లపై కమిషన్‌ అభ్యంతరం

అమరావతి: ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విద్యుత్తు బస్సులు అవసరం లేదని ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ సిఫారసు చేసింది.ఈ మేరకు విద్యుత్తు బస్సుల టెండర్లపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకర్‌రావు నేతృత్వంలోని ప్రివ్యూ కమిషన్‌ వెల్లడించింది. విద్యుత్తు బస్సులను లీజు పద్దతిన తీసుకోవడం సరికాదని కమిషన్‌ అభిప్రాయపడింది. 

రూ.100 కోట్లు పైబడిన టెండర్ల ప్రక్రియపై ఏపీ  ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ...టెండర్ల వ్యవహారంపై తన నిర్ణయాలను ప్రకటించింది. ఏపీఎస్‌ ఆర్టీసీ రాష్ట్రంలో 350 విద్యుత్తు బస్సులను లీజుకు తీసుకోవాలని భావించింది. దీనిలో భాగంగా కొద్దినెలల క్రితం టెండర్ల ప్రక్రియను జ్యుడీషియల్‌ ప్రివ్యూకు ఏపీ ప్రభుత్వం పంపింది. ఆన్‌లైన్‌ విధానంలో ప్రజల నుంచి సూచనలు స్వీకరించడంతో పాటు ..ప్రివ్యూ కమిషన్‌ కూడా దీనిపై అధ్యయనం చేసింది.విద్యుత్తు బస్సుల ప్రతిపాదనపై ప్రభుత్వానికి కమిషన్‌ పలు సిఫార్సులు చేసింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాల్సిన అవసరం లేదని తన నివేదికలో జ్యుడీషియల్‌ కమిషన్‌ పేర్కొంది.

కమిషన్‌ సిఫార్సులివే...
*350 విద్యుత్తు బస్సుల కంటే డీజిల్‌ బస్సులు నడపడమే మేలు.
*విద్యుత్తు వాహనాల సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. విద్యుత్తు వాహనాల ఉత్పత్తి పెరిగితే... ధరలు బాగా తగ్గుతాయి.
* ఒక్కో విద్యుత్తు బస్సుకు రూ.45 లక్షలు రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం అర్ధరహితం.
*రాష్ట్రం ఆర్థికంగా కుదేలై ఉన్న పరిస్థితిలో రూ.157.50 కోట్లు రాయితీగా చెల్లించటం అసంబద్ధమైన చర్య. లీజు ప్రాతిపదికన తీసుకునే బస్సులకు నిధులు ఎక్కడివని కమిషన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
* ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరంగా ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోని నగరాలకు ఇచ్చినా ఇబ్బందేమీ లేదు.
* విశాఖ, విజయవాడ, కాకినాడ, అమరావతి, తిరుపతి నగరాల్లో భారత స్టాండర్డ్‌ 4 తరహా బస్సులను వినియోగిస్తే సమస్య ఉండదు. 
*రాష్ట్రంలో వాయు నాణ్యత సూచీలు మెరుగ్గానే ఉన్నాయి.. విద్యుత్తు బస్సుల టెండర్‌ ప్రతిపాదనలను సవరించాలి. అని జ్యుడీషియల్‌ ప్రివ్యూ సూచించింది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.