విజయవాడలో ఐకాస ప్రజా పాదయాత్ర 
close

తాజా వార్తలు

Updated : 15/12/2020 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడలో ఐకాస ప్రజా పాదయాత్ర 

పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు, మహిళలు

విజయవాడ: రాజధాని అమరావతికి మద్దతుగా రైతులు చేస్తున్న ఉద్యమానికి ఈనెల 17తో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్ర చేపట్టింది. అమరావతి పరిరక్షణ ప్రజా పాదయాత్ర పేరిట విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పెద్దఎత్తున రైతులు, మహిళలు పాల్గొన్నారు. పడవల రేవు కూడలి నుంచి మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి వరకు నిర్వహించిన ఈ పాదయాత్రకు తెదేపా, భాజపా, కాంగ్రెస్‌, జనసేన, సీపీఎం, ఆమ్‌ఆద్మీ మద్దతు ప్రకటించాయి. అమరావతి ఉద్యమానికి సంఘీభావంగా ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులు పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తుంటే సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని ఐకాస నేతలు ప్రశ్నించారు. రాజధాని మార్పుతో అమరావతి ఆ ప్రాంత రైతులకే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ ద్రోహం చేశారని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

ఇవీ చదవండి..

‘మూడు రాజధానులంటూ వితండవాదమేంటి?’

కార్మికుల ‘చలో అమరావతి’ ఉద్రిక్తం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని