త్వరలో మరోవిడత భారత్‌-చైనా చర్చలు
close

తాజా వార్తలు

Published : 08/11/2020 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో మరోవిడత భారత్‌-చైనా చర్చలు

న్యూదిల్లీ: భారత్‌-చైనాల మధ్య త్వరలో మరోవిడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరగనున్నాయి. గత వారం చివరిలో చుషూల్‌లో జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. దీంతో మరి కొన్నాళ్లలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ ‘‘వాస్తవాధీన రేఖ వెంట ఇరుదేశాలు ఉద్రిక్తతల ఉపసంహరణకు అవసరమైన అభిప్రాయాలను పంచుకొన్నారు. రెండు దేశాల నాయకత్వాలు తీసుకొనే నిర్ణయాలను అమలు రెండు పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల బలగాల మధ్య అపోహలు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇరు వైపులా చర్చలను కొనసాగిస్తూ దౌత్య మార్గాలను తెరిచి ఉంచాలని నిర్ణయించాయి. సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఇటీవల విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణను చేసేందుకు ఇరు దేశాలు సైనిక, దౌత్య చర్చలను కొనసాగిస్తాయని పేర్కొన్నారు. 

7వ విడత చర్చల్లో సాధ్యం కాని షరతులను విధించింది.  భారత్‌ ఫింగర్ నెంబర్‌ 3 వరకు పెట్రోలింగ్‌ చేయాలని కోరింది. చైనా ఫింగర్‌ నెంబర్‌ 5 వరకు పెట్రోలింగ్ చేస్తానని తెలిపింది. ఫింగర్‌ నెంబర్‌ 4ను నిస్సైనిక ప్రాంతంగా ఉంచాలని చెబుతోంది. ఇది చైనా ఎప్పుడూ అనుసరించే రెండు అడుగులు ముందుకు.. ఒక అడుగు వెనక్కి అన్న వ్యూహానికి అనుకూలంగా ఉంది. వాస్తవానికి ఫింగర్‌ 8 వరకు ఎల్‌ఏసీ ఉందని భారత్‌ చేస్తున్న వాదనకు ఇది విరుద్ధం. భారత్‌ దీనిని తిరస్కరించింది. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. భారత్‌ భూమిని వదులుకొనే ప్రశ్నే లేదని తెలిపారు. అంతేకాదు.. భారత్‌ స్పంగూర్‌ సరస్సు వద్ద ఉన్న వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయాలన్న డ్రాగన్‌ డిమాండ్‌ను కూడా ఇప్పటికే తిరస్కరించింది.  

బైడెన్‌ గెలుపు..ఊపిరిపీల్చుకున్న చైనా..!

భారత్‌-చైనా ‘వేలు’ విడవని చర్చలు..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని