రూ.10లక్షలిస్తే బాలుడిని వదిలేస్తాం!
close

తాజా వార్తలు

Published : 17/11/2020 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.10లక్షలిస్తే బాలుడిని వదిలేస్తాం!

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వినయ్‌ అనే బాలుడి అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. సత్తెనపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వస్త్రవ్యాపారి కుమారుడు వినయ్‌ సోమవారం అదృశ్యమయ్యాడు. రాత్రి సమయంలో అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసి ‘‘మీ అబ్బాయి మా వద్దే ఉన్నాడు.. రూ.10లక్షలు ఇస్తేనే వదిలేస్తాం’’అంటూ బాలుడి కుటుంబసభ్యులకు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో వెంకటేశ్వర్లు కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

అయితే, సోమవారం వినయ్‌ తన తాత వద్ద ఉన్న సిమ్‌ కార్డును అడిగి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పుడు అదే నంబర్‌ నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తుండటంతో ఇది కిడ్నాపా? లేక బెదిరించటం కోసం ఎవరైనా ఇలా చేస్తున్నారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా సత్తెనపల్లి పట్టణంలో వాహనాల తనిఖీ చేపట్టారు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని