close

తాజా వార్తలు

Updated : 04/12/2020 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్‌ఈసీ ఉత్తర్వులపై కాంగ్రెస్‌ అభ్యంతరం

హైదరాబాద్‌: స్వస్తిక్‌ గుర్తు కాకుండా పోలింగ్‌ స్టేషన్ నంబర్లున్న గుర్తుతో ఓటు వేసినట్టు వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఏ ఇతర గుర్తుతో ఓటు వేసి ఉన్నా అక్కడ ఓట్ల లెక్కింపును నిలుపుదల చేయాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని రాజకీయపార్టీల దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధికి  పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ జి.నిరంజన్‌ లేఖ రాశారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందన్నారు. తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వల్లే ఈ తప్పిదాలు జరిగాయని వివరించారు.

ఎన్నికల సంఘం అర్ధరాత్రి ఉత్తర్వులు

గ్రేటర్‌ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో స్వస్తిక్‌ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబంధిత పోలింగ్‌ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్‌ సమయంలో ఓటర్లకు స్వస్తిక్‌ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్‌ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి తీసుకురావడంతో.. దానికి పరిష్కారంగా అలాంటి ఓట్లనూ లెక్కించాలంటూ ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని