
తాజా వార్తలు
ఆర్జీఐఏలో 25నుంచి విమానాల రాకపోకలు
శంషాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి దేశీయ విమానాల రాకపోకలు మొదలవుతాయని.. అందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్జీఐఏ సీఈవో ఎస్జీకే కిషోర్ వెల్లడించారు. ఈ మేరకు విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయంలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో తెలిపారు. హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించే వారి కోసం క్యూలైన్లలో నిలబడే అవసరం లేకుండానే బోర్డింగ్ పాసులు పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా విమానాశ్రయంలో ప్రత్యేకంగా గుర్తులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించింది మొదలు తిరిగి వెళ్లే వరకు పూర్తి స్థాయిలో శానిటైజర్స్ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రయాణికుల లగేజీలు తీసుకెళ్లే ట్రాలీలను శానిటైజ్ చేసేందుకు ప్రత్యేకంగా డిసిన్ఫెక్టివ్ టన్నెల్స్ ఏర్పాటు చేశామన్నారు. విమానాల్లో ఆహారం తీసుకునేందుకు అనుమతి లేదని.. ప్రయాణికులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సీఈవో కిషోర్ వివరించారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
