close

తాజా వార్తలు

Updated : 15/08/2020 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. ఎస్పీబీ ఆరోగ్యంపై స్పందించిన ఎస్పీ చరణ్‌

కరోనాతో పోరాడుతూ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తన తండ్రి అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆడియో సందేశాన్ని పంపారు. ‘‘ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న వెంటిలేటర్‌‌పై ఉంచడం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయన ఈ పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారు. నాన్నగారి ఆరోగ్యంపై నేను అప్‌డేట్‌ ఇస్తాను’’ అని చరణ్ సందేశంలో‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో వర్షాలు, వరదలపై కేసీఆర్‌ ఆరా

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదలు రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సీఎస్‌, డీజీపీ మంత్రులతో సీఎం మాట్లాడారు. వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. జిల్లాల పరిస్థితిని సమీక్షించి తగు సూచనలు చేశారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. LAC-LOC..మన పరాక్రమం ప్రపంచం చూసింది

74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. అటు పాకిస్థాన్‌కు, ఇటు చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. ఎల్‌ఓసీ నుంచి ఎల్‌ఏసీ వరకూ దేశ సార్వభౌమత్వానికి సవాలు విసిరిన వారికి భారత సైన్యం తగిన రీతిలో సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంతోపాటు విస్తరణవాదంపై కూడా భారత్‌ కృత నిశ్చయంతో పోరాడుతోందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టిక్‌టాక్‌కు ట్రంప్‌ 90రోజుల డెడ్‌లైన్‌

ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌కు ట్రంప్‌ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో టిక్‌టాక్‌కు నవంబర్‌ 12 వరకు గడవు లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
5. ‘దానిని అంటరానితనంలా పోల్చడం బాధాకరం’

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను మీడియాతో వెల్లడిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇవాళ కూడా మీడియా ముందుకొచ్చారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ నూతన జాతీయ విద్యావిధానంపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిపై రఘురామ్‌ స్పందిస్తూ.. తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో సీఎం పోల్చడం బాధాకరమన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు అడ్డుకుంటున్నారని చెప్పడం దురదృష్టకరమని చెప్పారు. 

6. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా!

కరోనాతో విలవిల్లాడుతున్న ప్రపంచం ముందుకు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చామని ప్రకటించి అందరినీ రష్యా ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశం మరో మందుడుగు వేసినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు సమాచారం. అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు చెప్పినట్లు ఇంటర్‌ఫ్యాక్స్‌ అనే న్యూస్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ యాప్స్‌.. కాలర్‌ట్యూన్స్‌ కోసమే

ఒకప్పుడు మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థే కాల్‌ చేసి ఈ పాట కావాలా? ఆ పాట కావాలా? అంటూ వినిపించి.. నచ్చిన దాన్ని కాలర్‌ ట్యూన్‌గా సెట్‌ చేసేది. ఇప్పుడు అలాంటి కాల్స్ ‌రావడం దాదాపుగా తగ్గిపోయాయి. డిజిటల్‌ యుగంలో మొబైల్‌ నెటవర్క్స్‌ సంస్థలు సొంతంగా మ్యూజిక్‌ యాప్స్‌ను తీసుకొచ్చి.. ఆ యాప్‌లో నచ్చిన పాటను కాలర్‌ట్యూన్స్‌గా సెట్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఆ యాప్స్‌ ఇవీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోదీ..కావాల్సింది మీలాంటి వ్యక్తే

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా తమ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఇస్తోన్న ప్రాముఖ్యతను చాటిచెప్పారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ..శానిటరీ ప్యాడ్లను రూపాయికే అందజేస్తోన్న విషయాన్ని వెల్లడించారు. బహిరంగంగా మాట్లాడటానికి ఇప్పటికీ ఇష్టపడని రుతుక్రమం అంశంపై ప్రధాని చూపిన చొరవకు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇదే రోజు.. భారత్‌తోపాటు మరికొన్ని దేశాలు

ఆగస్టు 15.. భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు. తెల్లదొరలపై పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలకు ప్రతిఫలం దక్కిన రోజు. 1947లో బ్రిటీష్‌ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి ఏటా ఆగస్టు 15న భారతీయులమంతా గర్వంగా.. ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటూ ఉన్నాం. మనం సరే.. ఇదే రోజున మనతోపాటు మరికొన్ని దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని మీకు తెలుసా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 65మంది సింగర్స్‌ 5 భాషలు.. ఒక పాట!

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దేశభక్తి చిత్రం  ‘రోజా’. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇందులోని ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’ పాటను 5 భాషల్లో 65మంది గాయకులు ఆలపించారు. ‘టుగెదర్‌ యాజ్‌ వన్‌’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను రామ్‌చరణ్‌ విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.