close

తాజా వార్తలు

Published : 12/11/2020 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నటుడు ఆసిఫ్‌బస్రా ఆత్మహత్య

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆసీఫ్‌ బస్రా(53) ఆత్మహత్యకు పాల్పడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న తన అపార్టుమెంట్లో గురువారం ఉరేసుకున్నారు. ఆయన మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించింది.  బస్రా గత ఐదేళ్లుగా అద్దెకు ఉంటున్నట్లు అపార్టుమెంటువాసులు చెప్పారు. కాగా.. ఆయన ఆత్మహత్యపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు స్పందిస్తున్నారు. ‘ఇది చేదువార్త.. నిజం కాకూడదని కోరుకుంటున్నా’ అని ప్రముఖ డైరెక్టర్‌ హన్సల్‌ మెహతా ట్విటర్‌లో అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘నమ్మశక్యం కావడం లేదు. లాక్‌డౌన్‌కు ముందే ఆయనను కలిశాను’ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి అన్నాడు.
అసీఫ్‌ బస్రా తన నటనతో అటు సినిమాలతో పాటు ఇటు బుల్లితెర అభిమానులకు సుపరిచితులయ్యారు. సుషాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో పాటు హిచ్‌కీ, క్రిష్‌-3, జబ్‌ వీ మెట్‌, బ్లాక్‌ ఫ్రైడే సినిమాల్లో నటించారు. హోస్టేజెస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో ఆయన చివరగా కనిపించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన