‘పోతురాజు’గా నందుని చూశారా?
close

తాజా వార్తలు

Published : 03/09/2020 14:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పోతురాజు’గా నందుని చూశారా?

హైదరాబాద్‌: నటుడు నందు, రష్మీ గౌతమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. ఓ చక్కటి కుటుంబ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రవీణ్‌ పగడాల, బోస్‌ నిడిమోలు, ఆనంద్‌ రెడ్డి మడ్డి, మనోహర్‌ రెడ్డి ఈడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు నందు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. మా పోతురాజు ‘నందు విజయ్‌ క్రిష్ణ’కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపింది. ఈ చిత్రంలో నందు.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అభిమానిగా పోతురాజు పాత్రలో కనిపించనున్నారు. 

ఈ చిత్రానికి సబంధించి  టైటిల్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన నందు లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్ర బృందం తెలిపింది. నందు, రష్మీల పాత్రలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయని పేర్కొంది. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సుజాతా సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని