close

తాజా వార్తలు

Published : 11/07/2020 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. గుడ్‌ న్యూస్‌: కరోనా చికిత్సకు మరో ఔషధం

కరోనా చికిత్సలో వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) మరో ఔషధానికి అనుమతులిచ్చింది. చర్మ వ్యాధి అయిన సొరియాసిస్‌ను నయం చేయడానికి ఉపయోగించే ‘ఇటోలీజుమ్యాజ్‌’ ఇంజెక్షన్‌ను ‘పరిమితం చేసిన అత్యవసర వినియోగం’ కింద వాడేందుకు అంగీకరించింది. మోతాదు నుంచి తీవ్ర స్థాయి లక్షణాలతో బాధపడుతున్న కొవిడ్‌ రోగులకు దీన్ని ఇవ్వొచ్చని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రూ.426 కోట్లతో హైదరాబాద్‌లో వంతెనలు  

నగరంలోని పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేశారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.426 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ స్టీల్‌ బ్రిడ్జి, మరో వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో రూ.350  కోట్లతో ఎలివేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జి, రెండో దశలో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు 3 లేన్ల వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. రూ.76 కోట్లతో చేపడుతున్న ఈ నిర్మాణానికి కిషన్‌రెడ్డి భూమిపూజ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 24 గంటల్లో 27,114 కేసులు..519 మరణాలు..

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో రోజురోజుకీ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 27,114 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 8,20,916కి చేరింది.519 మంది చనిపోయారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2,83,407 మంది చికిత్స పొందుతుండగా.. 5,15,386 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆలయ చరిత్రలో మొదటిసారి: తలసాని

ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా నిరాడంబరంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ‘‘అధికారులు, అర్చకుల సమక్షంలో ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తాం. ఆలయ చరిత్రలో మొదటిసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాలో కరోనా కరాళ నృత్యం

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ అత్యంత ప్రమాదకరంగా ఉంది. దేశంలో మొత్తం కేసుల  సంఖ్య 33 లక్షలకు చేరువైంది. గత మూడు రోజుల నుంచి రోజుకు 60 వేల కొత్త కేసులు బయటపడగా.. నిన్న ఒక్క రోజే 72 వేల కేసులు నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో  849 మంది  మృతి చెందారు. అమెరికాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 32,91,786కి చేరగా మృతుల సంఖ్య 1,36,671కి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సింగపూర్‌లో అధికార పార్టీదే విజయం

 సింగపూర్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ ఘన విజయంసాధించింది. సాధారణ ఎన్నికల్లో 93 స్థానాలకు గానూ 83 స్థానాలను పీఏపీ కైవసం చేసుకుంది. 61.2 శాతం ఓట్లను సాధించింది. పీఏపీ విజయంతో లీ హసీన్‌ లూంగ్‌ మరోసారి ప్రధాని కానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘కట్టడి సాధ్యమే.. ధారావే ఉదాహరణ’

కరోనా ఉగ్రరూపంతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. గత ఆరు వారాల్లోనే కేసులు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అయినప్పటికీ వైరస్‌ వ్యాప్తిని అదుపులోకి తీసుకురావడం ఇప్పటికీ సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. ఇందుకు భారత్‌లోని అతిపెద్ద మురికివాడ ధారావిని ఒక ఉదాహరణగా  సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొనడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వందేళ్లలో చూడని సంక్షోభమిది: శక్తికాంతదాస్  

దేశవ్యాప్తంగా గత వందేళ్లలో ఎన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు.  ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని రకాల చర్యలు తీసుకుందని వివరించారు.ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వృద్ధి రేటుతో పాటు ఆర్థిక స్థిరత్వంపై ఆర్‌బీఐ దృష్టి సారించిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇది బంగారు హోటల్‌

బంగారంతో చేసిన ఆభరణాలు, బంగారం పూత ఉన్న మొబైల్‌ ఫోన్లు... ఇలా చాలానే చూసే ఉంటారు. అంతెందుకు దుబాయిలోని బుర్జ్‌ అల్‌-అరబ్‌ హోటల్‌లోని ఎలివేటర్‌, లాబీని బంగారం పూతతో ఏర్పాటు చేశారు. యూఏఈలోని ఎమిరేట్స్‌ ప్యాలెస్‌లో సీలింగ్‌, గోడలకు బంగారం పూత వేశారనీ విన్నాం. లాస్‌ వెగాస్‌లోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో కిటికీలు కూడా బంగారంపూతతో నిర్మించారని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నెలా వియత్నాంలో ప్రయత్నం జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రహానెను అలా తీసిపడేశారు..

టీమ్‌ఇండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెను పాలల్లో పడిన ఈగలా తీసిపారేశారని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. కెరీర్‌లో మొత్తం 90 వన్డేలాడిన రహానె 35.26 సగటుతో 2962 పరుగులు చేశాడు. అందులో నాలుగో నంబర్‌ ఆటగాడిగా 27 మ్యాచ్‌ల్లో 843 పరుగులు చేయగా, ఓపెనర్‌గా 54 మ్యాచ్‌ల్లో 1937 పరుగులు సాధించాడు. ఈ గణంకాలే అతడి బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2018లో దక్షిణాఫ్రికాతో ఆడాక టీమ్‌ఇండియా అతడిని పక్కనపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని