close

తాజా వార్తలు

Published : 04/12/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిలిచిపోనున్న గూగుల్ పాలీ సేవలు

ఇంటర్నెట్ డెస్క్‌: ఏఆర్‌, వీఆర్‌ యానిమేషన్‌ డెవలపర్స్‌కి గూగుల్ షాకిచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి 3డీ యానిమేషన్ ఇమేజెస్‌ను షేర్‌ చేసి తిరిగి వాటిని వాడుకునేందుకు వీలుగా రూపొందించిన పాలీ వెబ్‌సైట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాలీ యూజర్స్‌ అందరికీ గూగుల్ మెయిల్ చేసింది. 2021 జూన్‌ 30 తేదీలోపు పాలీ వెబ్‌సైట్‌లో ఉన్న తమ కంటెంట్ మొత్తాన్ని గూగుల్ టేక్‌అవుట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అలానే 2021 ఏప్రిల్ 30 తేదీ తర్వాత పాలీ వెబ్‌సైట్‌లో 3డీ మోడల్స్‌ అప్‌లోడ్ చేయడం సాధ్యం కాదని తెలిపింది. 2017 నవంబరు నెలలో పాలీ వెబ్‌సైట్‌ను గూగుల్ ప్రారంభించింది.

వీఆర్‌ (వర్చువల్ రియాలిటీ), ఏఆర్‌ (అగ్‌మెంటెడ్ రియాలిటీ) సంబంధిత యాప్స్‌ రూపొందించే వారికి అవసరమైన 3డీ ఇమేజ్‌లు పాలీ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలానే డెవలపర్స్ తాము డిజైన్‌ చేసిన 3డీ ఇమేజ్‌లను పాలీలో అప్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే పాలీ సేవలను ఎందుకు నిలిపివేస్తున్నారనేది మాత్రం గూగుల్ వెల్లడించలేదు. ‘‘ఈ ప్రయాణంలో మాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీకు అవసరమైన సేవలను అందించేందుకు పాలీ సరైన వేదికని నమ్మి మాపై విశ్వాసాన్ని ఉంచినందుకు కృతజ్ఞతలు. మీ సృజనాత్మకతను మాతో పంచుకున్నందుకు మేంఎంతో ఆనందిస్తున్నాం. అది మమ్మల్ని ఎంతో ఆశ్చార్యానికి, కొత్త అనుభూతికి గురిచేసింది ’’ అని గూగుల్ యూజర్స్‌కి పంపిన మెయిల్‌లో పేర్కొంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన