close

తాజా వార్తలు

Updated : 23/08/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఖైరతాబాద్‌ గణేశుడిని ఆన్‌లైన్‌లో దర్శించుకోండి

భక్తులెవరూ రావొద్దని ఉత్సవ సమితి విజ్ఞప్తి

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ గణేశుడి దర్శనానికి భక్తులెవరూ రావొద్దని ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది. ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని.. ఆన్‌లైన్‌లో www.ganapathideva.org వెబ్‌సైట్‌ ద్వారా గణేశుడ్ని దర్శించుకోవాలని కోరింది. మరోవైపు ఖైరతాబాద్‌లో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఆ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో దర్శన సమయాలను కుదించారు. ఉదయం 5 గంటల నుంచి 10.30 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు అతికొద్ది మందికి మాత్రమే దర్శనానికి అవకాశమివ్వనున్నట్లు ఉత్సవ సమితి పేర్కొంది. కరోనా రక్కసి త్వరగా పోవాలని ఖైరతాబాద్‌ గణేశుడి చెంత నిత్యహోమాన్ని కొనసాగిస్తున్నారు.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని