ఎదురుదాడి తప్ప సమాధానం లేదు: లోకేశ్‌
close

తాజా వార్తలు

Updated : 05/12/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎదురుదాడి తప్ప సమాధానం లేదు: లోకేశ్‌

గుంటూరు: వరుసగా మూడు సార్లు పంట కోల్పోయి రైతులు ఆవేదన చెందుతున్నా... సీఎం సహా వైకాపా నేతలెవరికీ పట్టడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ ఆక్షేపించారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టాల వివరాల నమోదు సరిగా జరగడం లేదని రైతులు ఆయనకు తెలిపారు. ఇదే సమస్యలపై చట్టసభల్లో ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నుంచి ఎదురుదాడి తప్ప సమాధానం రావడం లేదని లోకేశ్‌ అన్నారు.  గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో పర్యటించి పంటలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పరిహారం అందలేదని రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.


 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని