close

తాజా వార్తలు

Published : 26/10/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు?

కొవిడ్‌-19 తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం అదనపు ఆదాయ మార్గాలను వెతుకుతోంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచాలని ఆలోచిస్తోంది. కాగా ఈ పెరుగుదల లీటరుకు రూ.3 నుంచి 6 వరకు ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మందుబాబులకు ఏపీ సర్కారు షాక్‌

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడాన్ని నిషేధించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా మద్యం తెచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. మూడు మద్యం సీసాలు తెచ్చుకునేందుకు కూడా అనుమతి లేదని.. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే మద్యాన్ని కేంద్రం నిబంధనల మేరకు అనుమతిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. పంజాబ్ vs కోల్‌కతా

ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. షార్జా వేదికగా పంజాబ్, కోల్‌కతా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

4. రఘునందన్‌ బంధువుల ఇళ్లలో సోదాలు

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. రఘునందన్‌ రావు మామ రాంగోపాల్‌రావు, మరో బంధువు అంజన్‌ రావు ఇళ్లలో అధికారులు సోమవారం సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో అంజన్‌ రావు ఇంట్లో అధికారులకు రూ.18.67లక్షలు లభించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బిహార్‌లో ముగిసిన తొలి విడత ప్రచారం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి తెరపడింది. ఈ నెల 28న (బుధవారం) 71 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత ఎన్నికలకు వాడీ వేడిగా ప్రచారం సాగింది. అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో బిహార్‌ రాజకీయాలను హీటెక్కించాయి. ప్రధాని నరేంద్ర మోదీ మూడు ప్రచార ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఓట్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా తొలి విడత ప్రచారం సాగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఆశాజనకంగా ఆక్స్‌ఫర్డ్ టీకా

కరోనా నియంత్రణకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా వృద్ధులు, యువతలో ఒకేలాంటి రోగనిరోధక ప్రతిస్పందనను కలిగిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే వృద్ధుల్లో ప్రతికూల స్పందన కూడా చాలా తక్కువగా ఉందని బ్రిటన్‌కు చెందిన ఔషధ సంస్థ ఆస్ట్రాజెనికా సోమవారం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అందరూ గెలిచేవరకూ..ఖైదీలుగా ఉండాల్సిందే

కొవిడ్‌-19 మహమ్మారి మన తరంలో అతి పెద్ద సంక్షోభం’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్త సంఘీభావానికి పిలుపునిస్తూ ప్రపంచ ఆరోగ్య సదస్సుకు సంబంధించి ఆన్‌లైన్‌ సెషన్‌ను ఆయన ప్రారంభించారు. వనరుల కొరతతో అల్లాడుతున్న పేద దేశాలకు వైద్యపరంగా సహకరించాలని అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు నేతలు, నిపుణులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ మార్కెట్లోకి ఎయిర్‌టెల్‌

టెలికం రంగ దిగ్గజ సంస్థ ఎయిర్‌ టెల్‌ సోమవారం కీలకమైన ముందడుగు వేసింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న క్లౌడ్‌ కమ్యూనికేషన్స్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ‘ఎయిర్‌టెల్‌ ఐక్యూ’ అనే ఓమ్ని కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. దీని ఏర్పాటును ఇండియన్‌ ఎంటర్‌ప్రైజ్‌ కమ్యూనికేషన్స్‌లో విప్లవాత్మక మార్పుగా ఎయిర్‌టెల్‌ పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ మార్కెట్‌ విలువ బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది ఏటా 20శాతం వృద్ధి సాధిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అథవాలే పార్టీలోకి సినీనటి పాయిల్‌ ఘోష్‌

సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ రాజకీయాల్లో చేరారు. కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఏ) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఆమెతో పాటు మరికొందరు రాందాస్‌ అథవాలే సమక్షంలో ఆ పార్టీ కండువాను కప్పుకొన్నారు. పాయల్‌ తమ పార్టీలో చేరిన సందర్భంగా అథవాలే ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, పాయల్‌ను ఆర్‌పీఐ(ఏ) మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఏపీలో తగ్గిన కొవిడ్‌ కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజు వ్యవధిలో 51,544 నమూనాలను పరీక్షించగా 1,901 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,08,924కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 19 మంది కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.