వారికి పోస్టల్‌ బ్యాలెట్‌.. ఇప్పట్లో లేనట్లే: ఈసీ
close

తాజా వార్తలు

Published : 18/07/2020 00:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారికి పోస్టల్‌ బ్యాలెట్‌.. ఇప్పట్లో లేనట్లే: ఈసీ

దిల్లీ: పోస్టల్‌ బ్యాలెట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, ఇతర ఏ ఎన్నికల్లో గానీ ప్రస్తుతానికి 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడం లేదని స్పష్టంచేసింది. దీని అమలు విషయంలో ఎదురవుతున్న కొన్ని అడ్డంకులు, సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది.

రానున్న బిహార్‌ ఎన్నికలు, మధ్యప్రదేశ్‌లో 24 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలని ఈ నెల మొదట్లో ఈసీ భావించింది. 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉన్న పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన అందరికీ వర్తింపజేయాలని నిర్ణయించింది. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. బిహార్‌ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్‌ 26తో ముగియనున్న నేపథ్యంలో ఆలోపే అక్కడ ఎన్నికలు జరపాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని