
తాజా వార్తలు
IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు
హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లడానికి సికింద్రాబాద్‌లో రైలు ఎక్కేందుకు లారీలో భౌతికదూరం పాటించకుండా వెళుతున్న వలస కూలీలు. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులో తీసిన చిత్రమిది.
ఎండలు మండుతున్న వేళ మేఘం కిందికి వచ్చింది ఏంటా అనుకుంటున్నారా? అదీ మేఘం కాదండి. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో దోమల నియంత్రణకు ఫాగింగ్ చేస్తుండగా వెలువడిన పొగ.
అంపన్ తుపాను ప్రభావంతో కోల్‌కతాలో కురిసిన వర్షాలకు హోల్‌సేల్ దుకాణాల్లోని పుస్తకాలు తడిసి పోవడంతో ఇలా రోడ్డు పక్కన ఆరబెట్టారు.
స్వస్థలాలకు వెళ్లేందుకు పట్నా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేందుకు పోటీపడుతున్న వలస కార్మికులు.
అంపన్ ధాటికి కోల్‌కతాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో జనరేటర్లు కొనుగోలు చేసేందుకు దుకాణం ఎదుట బారులు తీరిన ప్రజలు.
లాక్‌డౌన్‌తో బెంగళూరులో చిక్కుకుపోయిన విద్యార్థులు, యాత్రికులు, వలస కూలీలతో కిక్కిరిసిన ప్యాలెస్ మైదానం. వీరిని ఇక్కడి నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా అధికారులు రైల్వే స్టేషన్‌కు తరలిస్తారు.
మైసూర్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనుల్లో భాగంగా నైరుతి రైల్వే ఏర్పాటు చేసిన విగ్రహాలు ఇవి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విగ్రహాలకు మాస్క్‌లు తొడిగారు.
వలస కార్మికులు ప్రయాణిస్తున్న శ్రామిక్ రైలు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఆగింది. ఆ సమయంలో ప్రయాణికులకు పైపు ద్వారా మంచినీటిని అందిస్తున్న రైల్వే సిబ్బంది.
అంపన్ తుపాను విలయాన్ని తన చిత్రంలో చూపించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది ‘చేతులు కలపండి, తుపాను బాధితులకు సహాయం చేయండి’ అనే సందేశాన్ని దానిపై రాశారు.
మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన శానిటైజింగ్ జోన్.
లాక్డౌన్ నిబంధనలు సడలింపుతో ఏపీలో ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. తిరుపతి బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు ఆహారాన్ని తింటున్న కాకుల వద్దకు ఓ గద్ద వచ్చింది. తింటున్నఆహారాన్ని ఎత్తుకుపోతుందని భావించిన కాకి కాళ్లతో తన్నతూ, ముక్కుతో పొడుస్తూ గద్దను తరిమికొట్టింది.