వారితో స్నేహం అనూష భర్తకు తెలీదు: డీసీపీ
close

తాజా వార్తలు

Updated : 03/07/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారితో స్నేహం అనూష భర్తకు తెలీదు: డీసీపీ

ఘట్‌కేసర్‌: మేడ్చల్‌ జిల్లా పోచారంలో ఐదేళ్ల చిన్నారి ఆద్య హత్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనా స్థలాన్ని మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితా మూర్తి, ఏసీపీ నరసింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రఘువీరారెడ్డి పరిశీలించారు. హత్యకు గల కారణాలను కాలనీ వాసులతో పాటు అనూష బంధువులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ రక్షితా మూర్తి మాట్లాడుతూ.. కరుణాకర్‌, అనూష మధ్య స్నేహం ఉందనీ.. వారిద్దరి మధ్య ఇటీవల చోటుచేసుకున్న వివాదాలే హత్యకు దారితీశాయని చెప్పారు. 

చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేరనీ.. అనూష, రాజశేఖర్‌, కరుణాకర్‌ గతంలో స్నేహితులని తెలిపారు. కరుణాకర్‌, అనూష మధ్య గొడవలు ఉన్నట్టు రాజశేఖర్‌ చెప్పాడని ఆమె వెల్లడించారు. ఈ ముగ్గురి మధ్య పరిచయంపై అనూష భర్త కల్యాణ్‌కు తెలియదని డీసీపీ తెలిపారు. నిందితుడిని మెరుగైన వైద్యం నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అంతకుముందు ఈసీఐఎల్‌లోని ఓ ఆసుపత్రిలో ఉన్న అనూషతో మాట్లాడి డీసీపీ వివరాలు సేకరించారు. చిన్నారి తల్లి అనూష, ఆమె స్నేహితుడు రాజశేఖర్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని