close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 05/07/2020 03:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వ్యాక్సిన్‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ఐసీఎంఆర్‌..!

అంత‌ర్జాతీయ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ప్ర‌యోగాలు

దిల్లీ: క‌రోనా వైర‌స్‌ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు భార‌త్ బయోటెక్ త‌యారుచేసిన 'కోవాగ్జిన్' టీకాను ఆగ‌స్టు 15నాటికి తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న విష‌యం తెల‌సిందే. ఈ స‌మ‌యంలో ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలో ఇదెలా సాధ్య‌మ‌నే విష‌యంపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమయ్యాయి. దీంతో భార‌త వైద్య‌ ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌) స్ప‌ష్ట‌త‌నిచ్చింది. వ్యాక్సిన్‌పై ప్రీ-క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నందునే త‌దుప‌రి మొద‌టి- రెండోద‌శ‌ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ప్ర‌క‌టించింది. దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకురావ‌డంలో భాగంగా అంత‌ర్జాతీయ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ప్ర‌యోగాలు చేప‌డుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇప్ప‌టికే ప‌లు దేశాలు చేపట్టిన‌ ప్ర‌యోగాలు వివిధ ‌ద‌శ‌లో ఉన్నాయ‌ని ఐసీఎంఆర్ పేర్కొంది. ఈ స‌మ‌యంలోనే భ‌ద్ర‌త‌, నాణ్య‌త, నైతిక విలువల‌ను అనుస‌రించి దేశీయంగా వ్యాక్సిన్‌ను రూపొందించుకోవ‌డం ఎంతో ముఖ్య‌మ‌ని ఐసీఎంఆర్‌ అభిప్రాయప‌డింది. భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన 'కోవాగ్జిన్' టీకాపై ఆ సంస్థ అందించిన స‌మ‌గ్ర స‌మాచారం ఆశాజ‌న‌కంగా ఉండ‌టం వ‌ల్లే త‌దుప‌రి ప్ర‌‌యోగాలకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ప్ర‌జారోగ్య ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశామ‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ రూప‌క‌ల్ప‌న‌లో నిమ‌గ్న‌మైన ప‌రిశోధ‌న సంస్థ‌లు ఇదే ప్ర‌క్రియ‌ను అనుస‌రిస్తున్న‌ట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.

ఇవీ చ‌ద‌వండి..
ఆగ‌స్టు 15నాటికి క‌రోనా వ్యాక్సిన్‌!
రెండు వారాల్లో క‌రోనా ఔష‌ధ ప్ర‌యోగ ఫ‌లితాలు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.