నిరాశపరిచిన చెన్నై.. రాజస్థాన్‌ లక్ష్యం 126
close

తాజా వార్తలు

Updated : 19/10/2020 21:35 IST

నిరాశపరిచిన చెన్నై.. రాజస్థాన్‌ లక్ష్యం 126

కట్టుదిట్టంగా బంతులేసిన స్మిత్‌ సేన

ఇంటర్నెట్‌డెస్క్‌: అబుదాబి వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న టీ20లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (35*; 30 బంతుల్లో 4x4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ ధోనీ (28; 28 బంతుల్లో 2x4), ఓపెనర్‌ సామ్‌కరన్‌ (22; 25 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో చెన్నై బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ ధాటిగా ఆడలేకపోయారు. ఆది నుంచి వికెట్లు కోల్పోయారు. జట్టు స్కోర్‌ 13 పరుగులకే డుప్లెసిస్ ‌(10) ఔటవ్వగా తర్వాత 26 పరుగుల వద్ద షేన్‌ వాట్సన్ ‌(8) ఔటయ్యాడు. ఆపై అంబటి రాయుడు (13), సామ్‌కరన్‌ వికెట్లు కాపాడుకునేందుకు ప్రయత్నించినా వీరిద్దరూ వెనువెంటనే ఔటయ్యారు. 53 పరుగుల వద్ద సామ్‌, 56 పరుగుల వద్ద రాయుడు పెవిలియన్‌ చేరారు. ఆ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ, జడేజా ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. చివర్లో ధోనీ రనౌటవ్వడంతో కేదార్‌ (4) క్రీజులోకి వచ్చాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగి, శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ తెవాతియా తలో వికెట్‌ పడగొట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని