టిక్‌టాక్‌పై జుకర్‌బర్గ్‌ సందేహాలు
close

తాజా వార్తలు

Published : 24/08/2020 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌పై జుకర్‌బర్గ్‌ సందేహాలు

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలో వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ వాడకంపై ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సందేహాలను వ్యక్తం చేశారు. చైనా సంస్థ బైట్‌డాన్స్‌కు చెందిన ఈ యాప్‌... దేశ భద్రతకు ప్రమాదకరం కాగలదన్న ట్రంప్‌ ప్రభుత్వ ఆరోపణలను ఆయన సమర్థించారు. టిక్‌టాక్‌ భావ స్వాతంత్ర్య హక్కుకు కట్టుబడలేదని... దీనివల్ల అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి కూడా ఆటంకం కలగవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా, చైనాకు చెందిన ఇతర సామాజిక మాధ్యమాల సంస్థల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన ట్రంప్‌ ప్రభుత్వానికి సూచించారు. కాగా, అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించాలన్న ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానంలోనే అడ్డుకుంటామని ఆ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ త్వరలోనే కోర్టులో దావా వేయనున్నట్టు సంస్థ వెల్లడించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని