close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. పైలట్‌కు కరోనా.. విమానం వెనక్కి

పైలట్‌కు కరోనా నిర్ధారణ కావడంతో దిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయలు దేరిన ఎయిరిండియా విమానం మధ్యలోనే వెనుదిరిగింది. విమానంలో ఓ పైలట్‌కు వైరస్ సోకిందని గుర్తించడంతో విమానయాన సంస్థ వందే భారత్ మిషన్‌లో భాగంగా కేటాయించిన విమానాన్ని వెనక్కి రప్పించింది.  ‘వందే భారత్ మిషన్‌లో భాగంగా రష్యాలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి మాస్కోకు బయలుదేరిన ఏ320 విమానం మధ్యలోనే వెనుతిరిగింది’ అని ఎయిరిండియా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జూన్‌ 4న కృష్ణా బోర్డు సమావేశం

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటించింది. హైదరాబాద్‌ జలసౌధలో జూన్‌ 4వ తేదీన ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం కానుంది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం సమాచారం అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో మరో 131 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,504 మంది నమూనాలు పరీక్షించగా 131 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 61 ఉండగా.. రాష్ట్రంలో 70 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,461కి కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జాతీయ హోదా ఇస్తామని చెప్పలేదు: కిషన్‌రెడ్డి

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించిందని గుర్తు చేశారు. దేశంలో అనేక పేద రాష్ట్రాలున్నాయని.. అలాంటి చోట కూడా జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టులు లేవన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయి

తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ లేదని డైరక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ తెలంగాణ డైరెక్టర్‌ డా. శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నామని.. సడలింపుల అనంతరం కేసులు పెరుగుతున్నాయని వివరించారు. వైద్య విద్య సంచాలకులు డా.రమేష్‌ రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో కొందరు వ్యక్తుల వల్ల అనేక కుటుంబాలు వైరస్‌బారిన పడ్డాయని చెప్పారు. నాలుగో విడత లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి రాష్ట్రంలో కొత్తగా 1,005 కేసులు వచ్చాయని.. వీటిలో 470 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజుల పెంపు

రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజులు పెరిగాయి. పెంచిన ధరలను రేపు అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట, కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాలకు వెళ్లేవారిపై టోల్‌గేట్‌ భారం పడనుంది. కారు సింగిల్‌ ట్రిప్‌కు రూ.58, ఒకరోజు పాస్‌ రూ.87, నెల పాస్‌ రూ.1,740లుగా నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బుద్ధిగా కూర్చో.. వైఫై పరిధి దాటకు నాయనా!

 కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల వర్చువల్‌ పెళ్లిళ్లు అప్పుడే పట్టాలెక్కేశాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ పాఠాలు, వర్చువల్‌  కోర్టు విచారణల తరహాలో వివాహాలు కూడా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి కొన్ని స్టార్టప్‌లు. పెళ్లికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ దూసుకెళ్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సొంతూళ్లకు కార్మికులు..కొత్తగా హాట్‌స్పాట్లు

గత మూడువారాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే అవి వైరస్‌కు కేంద్రస్థానాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడుతూ కేబినెట్ సెక్రటరీ రాజీవ్‌గౌబా పలు విషయాలు వెల్లడించారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి సొంతరాష్ట్రాలకు వెళ్తుండటంతో తూర్పు భారతం ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాక్‌ క్రికెటర్‌కు ద్రవిడ్‌ చేసిన సాయమిదే

టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ క్రికెట్‌ కోసమే పుట్టాడని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు రషీద్‌ లతీఫ్‌ అన్నాడు. అండర్‌-19, భారత్‌-ఏ జట్లను తీర్చిదిద్దాడని వెల్లడించాడు. తన సహచరుడు యూనిస్‌ ఖాన్‌ ఎదుగుదలకు అతడెంతో సహాయం చేశాడని పేర్కొన్నాడు. ‘ద్రవిడ్‌ అద్భుతమైన వ్యక్తి. అతడి సూచనలు, మార్గదర్శకత్వం తనలోని అత్యుత్తమ ఆటతీరును ఎలా బయటపెట్టాయో యూనిస్‌ ఖాన్‌ సైతం చెప్పాడు. రాహుల్‌ది గొప్ప క్రికెట్‌ బుర్ర. క్రికెట్‌ ఆడేందుకే పుట్టాడు. అవును.. క్రికెట్‌ ఆడేందుకే పుట్టాడు. భారత్‌-ఏ, అండర్‌-19 జట్లను అభివృద్ధి చేశాడు. అందుకే అతడు క్రికెట్‌ కోసమే పుట్టాడని చెప్పొచ్చు’ అని లతీఫ్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈసారి సరిలేరు నీకెవ్వరులోని ‘మైండ్‌బ్లాక్‌’

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌వార్నర్‌ శనివారం మరో కొత్త పాటతో మనముందుకు వచ్చాడు. ఆయన సతీమణి కాండీస్‌తో కలిసి మరోసారి తెలుగు పాటకు స్టెప్పులేశాడు. మహేశ్‌బాబు తాజా బ్లాక్‌బస్టర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘మైండ్‌బ్లాక్‌’ పాటకు చిందులేశాడు. ఇది చిత్రీకరించడానికి 50 సార్లు కష్టపడ్డామని వార్నర్‌ తెలిపాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసి ఈ విషయాన్ని వెల్లడించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.