close

తాజా వార్తలు

Published : 22/11/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. హైదరాబాద్‌కు బ్రాండ్‌ఇమేజ్‌ ఒక్కరోజులో రాలేదు

 ఒక్కరోజులో, ఒక్క ప్రభుత్వంతో హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడుతూనే వృద్ధిని కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉందని.. అందుకే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. హైదరారబాద్‌ హైచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘బ్రాండ్‌ హైదరాబాద్‌ ఫ్యూచర్ రెడీ‌’ సదస్సులో కేటీఆర్‌ మాట్లాడారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు రెట్టింపయ్యాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మోడెర్నా టీకా ధర ఎంతంటే..?

తాము అభివృద్ధి చేస్తున్న టీకా ఒక్కో డోసుకు ప్రభుత్వాల నుంచి 25 డాలర్ల నుంచి 37 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మోడెర్నా ప్రకటించింది. సాధారణ ఫ్లూకి ఇస్తున్న వ్యాక్సిన్‌కు వసూలు చేస్తున్న 10 డాలర్ల నుంచి 50 డాలర్ల పరిధిలోనే కరోనా టీకా ధర కూడా ఉండే అవకాశం ఉందని సంస్థ సీఈవో స్టిఫానీ బాన్సెల్‌ జర్మనీకి చెందిన ఓ ప్రముఖ పత్రికకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెరాసను ప్రజలు ప్రశ్నించాలి: కిషన్‌రెడ్డి

భారతీయ జనతాపార్టీకి హైదరాబాద్‌ నగరంతో విడదీయలేని అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్‌ ద ప్రెస్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నా సద్వినియోగం చేసుకుంటామన్నారు. డబుల్‌బెడ్‌  రూమ్‌ ఇళ్ల హామీ ఏమైందని తెరాసను ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌ సంస్థానం జనాభా ఎంతంటే?

టీ పరిశ్రమలు, మెట్రో సేవలు, ఆకాశ హర్మ్యాలు, ఉద్యానవనాలు, పార్కులు, చారిత్రక కట్టడాలు, ప్రత్యేక వంటల రుచులు తదితరాలతో కూడిన భాగ్యనగరంగానే మనందరికీ హైదరాబాద్‌ గురించి తెలుసు. అయితే ఒకప్పుడు ఈ నగరం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆనాటి రాజ్య వ్యవస్థ.. ఏడో నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ సంస్కరణలు ఈనాటి పాలనకు దర్పణం పడతాయి. ఆయన హైదరాబాద్‌ రాజ్య అధికార పగ్గాలు చేపడుతున్న సమయంలో దేశ విదేశాల్లో మార్పులకు జీజం పడుతున్న కాలమని చరిత్రకారుల మాట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గ్రేటర్‌లో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం సాధ్యమేనా?

5. ట్రంప్‌ తీసుకున్న డ్రగ్‌కు అత్యవసర అనుమతి!

ప్రాణాంతక కరోనా వైరస్‌ అంతమొందించేందుకు వ్యాక్సిన్‌తో పాటు ఔషధాల కోసం విశేష కృషి జరుగుతోంది. ఇప్పటికే పలు రకాల చికిత్సా విధానాలు కొంత మేర ఫలితాన్నిస్తున్నాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ డ్రగ్‌’ భారీ ఆశలు రేకెత్తిస్తోంది. కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ దీన్ని ‘స్వర్గం నుంచి వచ్చిన బహుమతి’గా అభివర్ణించారు. వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో ఆయనకు ఈ డ్రగ్‌ను ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

93.69శాతం మంది కోలుకున్నారు!

6. వీడియో ఎడిటింగా... ఈ యాప్‌లు ఉన్నాయిగా

స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఫొటోలు, వీడియోలు తీసుకోవడం సులభమైపోయింది. వీడియోకు ఆసక్తికరమైన ఎఫెక్ట్స్‌ జోడించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసేస్తున్నారు. లైక్‌లు, కామెంట్లు సంపాదించేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లలో వీడియో ఎడిటింగ్‌ ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ స్మార్ట్‌ఫోన్లలో వీడియో ఎడిటింగ్‌ చేసేందుకు వివిధ యాప్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. వాటితో చాలా సులభంగా మీరూ వీడియోలు రూపొందించొచ్చు, ఎడిట్‌ చేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్లీజ్‌ నా ఫొటోలు తొలగించండి..!

తన ఫొటోలను సోషల్‌మీడియా ఖాతాల నుంచి తొలగించాలని దంగల్‌ నటి జైరా వాసీం అభిమానులకు విన్నపం చేశారు. జీవితంలో తాను కొత్త అంకానికి శ్రీకారం చుట్టనున్నానని.. దానికి అభిమానులు, నెటిజన్లు సాయం చేయాలని ఆమె కోరారు. ‘హాయ్‌!! మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నాను. మీరు నాపై కురిపిస్తున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని అందర్నీ ఓ సాయం అడుగుతున్నాను. దయచేసి మీ  సోషల్‌మీడియా ఖాతాల నుంచి నా ఫొటోలను తొలగించాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్యాన్‌ పేజీలకు కూడా ఈ విషయాన్ని తెలియజేయగలరు. ’ అని జైరావాసీం వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యాప్‌ తోడుగా... మారిపోండి ఫిట్‌గా

ఫిట్‌గా ఉండటం అంటే ఎవరికి నచ్చదు. ఈ విషయంలో అశ్రద్ధ చేసేవారు కూడా కొవిడ్‌-19 నేపథ్యంలో ఫిట్‌గా ఉండేందుకు కసరత్తు బాటపట్టారు. ఇంట్లోనే కసరత్తులు చేసేందుకు ఉపయోగపడే ఫిట్‌నెస్‌ యాప్‌లపై దృష్టి సారిస్తున్నారు. ఫిట్‌నెస్‌ యాప్‌లు ఎప్పటికప్పుడు యూజర్‌ ఫిట్‌నెస్‌ను మానిటర్‌ చేస్తూ అవసరమైన సూచనలు చేస్తుంటాయి. అంతేకాకుండా మీరు ఎంత బరువు ఉండాలి, ఎన్ని కేలరీలు ఖర్చు చేయాలి అంటూ పర్సనల్ ట్రైనర్‌లా చెబుతాయి. అలాంటి కొన్ని యాప్‌ల వివరాలు మీ కోసం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫ్యాషన్‌ ప్రియుల్ని ఆకట్టుకున్న కాజల్‌ డ్రెస్‌

తన ప్రియసఖుడు గౌతమ్‌ కిచ్లుతో ఏడడుగులు వేసి శ్రీమతిగా మారారు అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌. అక్టోబర్‌ 30న వీరి వివాహం ముంబయిలోని ఓ హోటల్‌లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చింది. వెకేషన్‌లో భాగంగా భర్తతో దిగిన పలు ఫొటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హిట్‌మ్యాన్‌ బదులు ఎవరు?

రోహిత్‌శర్మ.. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు వెన్నెముక. గత కొన్నేళ్లుగా వన్డే, టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్న ఈ ఓపెనర్‌ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. మరి హిట్‌మ్యాన్‌ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ఆసీస్‌ గడ్డపై టీమ్‌ఇండియా ఆడే ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో (మూడేసి వన్డే, టీ20) శిఖర్‌ ధావన్‌కు జతగా ఓపెనర్‌గా బరిలో నిలిచేదెవరు? రోహిత్‌ లేకపోయినా మేమున్నాం అంటున్నారు కొంతమంది కుర్రాళ్లు.. మరి ఈ రేసులో ఉన్న వాళ్లెవరో చూద్దామా..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏటీపీ ఫైనల్స్‌లో మెద్వెదేవ్‌ vs డొమినిక్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.