
తాజా వార్తలు
టాప్‌టెన్ జాబితాలో జమ్మికుంట పోలీస్‌స్టేషన్
ఇంటర్నెట్‌డెస్క్: తెలంగాణలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 16,671 పోలీస్ స్టేషన్లలో అగ్రస్థానంలో నిలిచిన 10 ఉత్తమ పోలీస్ స్టేషషన్ల జాబితాను గురువారం కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. వాటిలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్‌స్టేషన్ 10వ స్థానం దక్కించుకుంది. వివిధ విభాగాల్లో పోలీస్ స్టేషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2015లో గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన డీజీపీల సదస్సులో పోలీసు స్టేషన్ల పనితీరు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. డేటా విశ్లేషణ, నేరుగా పనితీరు పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేంద్ర హోం శాఖ పోలీసు స్టేషన్లకు ర్యాంకులు ప్రకటించింది. ప్రతి రాష్ట్రంలో ఉత్తమంగా పనిచేసిన పోలీస్ స్టేషన్ల షార్ట్ లిస్టుతో కేంద్రం ర్యాంకింగ్ ప్రక్రియ చేపట్టింది. ఆస్తులకు సంబంధించిన నేరాలు, మహిళలపై నేరాలు, బలహీనవర్గాలపై నేరాలు, తప్పి పోయిన వ్యక్తులు, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన విషయాల్లో కేసులను ఈ ఏడాది కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ప్రతి రాష్ట్రం నుంచి750కి పై పోలీస్ స్టేషన్లను గుర్తించి వాటిలో ఒకటి లేదా రెండు పోలీస్ స్టేషన్లను అధికారులు ఎంపిక చేశారు.
హర్షం వ్యక్తం చేసిన డీజీపీ
దేశంలోనే అత్యుత్తమ పది పోలీస్ స్టేషన్లలో ఒకటిగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన జమ్మికుంట స్టేషన్ ఎంపిక కావడం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు దక్కిన ఈ పురష్కారాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని ఇతర స్టేషన్లలో కూడా ఉత్తమ పౌర సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు కృషి చేయాలన్నారు. వరుసగా రెండోసారి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలవడం పట్ల కరీంనగర్ కమిషనర్ కమల హాసన్ రెడ్డి, జమ్మికుంట స్టేషన్ హౌస్ అధికారిని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. 2019 సంవత్సరంలో చొప్పదండి పోలీస్ స్టేషన్ 7వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలిచింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
