close

తాజా వార్తలు

Published : 08/07/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉగ్రవాదులకు కరోనా ఓ అస్త్రం: ఐరాస

న్యూయార్క్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఉగ్రవాదులు కొత్త అవకాశంగా మలుచుకునే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. ఉగ్రవాదంపై కరోనా ప్రభావాన్ని ఇప్పటికిప్పుడే అంచనా వేయడం సాధ్యం కాకపోయినప్పటికీ.. దీన్ని ఆసరాగా చేసుకునేందుకు ఉగ్రముఠాలు యత్నిస్తున్నాయన్న విషయం సుస్పష్టం అని తెలిపారు. ప్రజల మధ్య విభజన, ప్రాంతీయ అస్థిరత  వంటి దుశ్చర్యలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కొవిడ్‌-19 సంక్షోభాన్ని ఓ అస్త్రంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు. ఒకప్పుడు సిరియా, ఇరాక్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన ఐసిస్‌.. ఈ సంక్షోభం ఆసరాగా చేసుకొని మరోసారి తన పట్టుకోసం యత్నింస్తోందని తెలిపారు. సోమవారం ఐరాస ఉగ్రవాద నిరోధక వారోత్సవాల్ని ప్రారంభిస్తూ ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అలాగే డిజిటల్‌ సాంకేతికత దుర్వినియోగం, సైబర్‌ దాడులు, బయో-ఉగ్రవాదం వంటి కొత్తతరం ముప్పుపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ సంక్షోభం నొక్కి చెప్పిందని గుటెరస్‌ తెలిపారు. ప్రత్యర్థి దేశాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఇప్పటికే ఉగ్రమూకలు దీన్ని అస్త్రంగా మార్చుకున్నాయనడానికి ఆధారాలున్నాయన్నారు. అందులో భాగంగానే వివిధ దేశాలపై ‘కాన్‌స్పిరసీ థియరీ’లు వెలుగులోకి వచ్చాయన్నారు.  ఐరోపా సమాఖ్య రాయబారి జోసెఫ్‌ బోరెల్‌ మాట్లాడుతూ.. ఈ సంక్షోభంలో ఉగ్రవాద నిరోధానికి పొంచి ఉన్న సవాళ్లపై ప్రపంచదేశాలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం పీచమణచడానికి కరోనా సంక్షోభం కొత్త సవాల్‌గా నిలిచిందని అమెరికా రాయబారి రిచర్డ్‌ హాస్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని