
తాజా వార్తలు
శివసేనలోకి ఊర్మిళ.. చేరిక ఎప్పుడంటే?
ముంబయి: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ మాజీ నేత ఊర్మిళ మతోంద్కర్ శివసేనలో చేరికకు ముహూర్తం ఖరారైంది. సోమవారం ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్‌ను వీడిన ఏడాది తర్వాత ఆమె శివసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబయి నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నుంచి బరిలో దిగిన ఊర్మిళ ఓటమిపాలయ్యారు. అనంతరం ముంబయి కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి నచ్చకపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 12 స్థానాలను భర్తీ చేసేందుకుగాను ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కొంతమంది పేర్లను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి సిఫారసు చేసింది. ఈ జాబితాలో శివసేన నుంచి ఊర్మిళ పేరును సిఫారసు చేసింది. అప్పట్లోనే ఆమె శివసేనలో చేరతారంటూ ఊహాగానాలు వినిపించాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
