సిట్‌ నివేదిక లీక్‌.. కోర్టు ధిక్కారమే: యనమల
close

తాజా వార్తలు

Published : 13/09/2020 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిట్‌ నివేదిక లీక్‌.. కోర్టు ధిక్కారమే: యనమల

అమరావతి: కోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజధాని భూములపై ప్రభుత్వం సిట్‌ నివేదికను లీక్‌ చేయడం కోర్టు ధిక్కారమేనని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అవినీతిని బయటపెట్టారనే అక్కసుతోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కక్షసాధిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల తర్వాత అమరావతి సరిహద్దుల్లో అవకతవకలు జరిగాయని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీలో ఉన్నది జగన్‌ అనుచరులే కాబట్టి సిట్‌ చెప్పేది కూడా జగన్‌ ఆలోచనేనని యనమల ఆరోపించారు. 

సీఎం జగన్ ఆలోచనా విధానాలు నేరపూరితంగా ఉన్నాయని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజధాని అమరావతిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలతో ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే వైకాపా దూరమైందని విమర్శించారు. అదేవిధంగా అక్రమ అరెస్టులపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ మీటర్లు పెట్టే దురాలోచన వల్ల వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని యనమల వ్యాఖ్యానించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని