close

తాజా వార్తలు

Updated : 24/10/2020 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.16 వేల కోసం హత్య

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేటలో దారుణం జరిగింది.నవయుగ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద సుభాని(25) అనే యువకుడిని రఫి అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. రూ.16వేల అప్పు విషయంలోనే హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. గతంలో రఫీ దగ్గర గతంలో సుబాని కొంతనగదు అప్పు తీసుకోవడంతో తిరిగి చెల్లించాల్సిందిగా పలుమార్లు అడిగినా చెల్లించలేదు. దీంతో మాట్లాడుకుందాం రమ్మని సుభానిని బార్‌కు పిలిపించిన రఫీ.. అక్కడ మద్యం తాగిన అనంతరం గొడవకు దిగి హత్య చేసినట్లు తెలుస్తోంది. సీపీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసిన తెనాలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడితో పాటు అతడి ఇద్దరు స్నేహితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన