close

తాజా వార్తలు

Updated : 06/04/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సైకిల్‌పై వచ్చి.. ఓటేసిన విజయ్‌

చెన్నై: తమిళనాడులో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వేసవి దృష్ట్యా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా తొలి గంటల్లోనే ఓటేశారు. ప్రముఖ నటుడు విజయ్‌ సైకిల్‌పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. 

చెన్నైలోని నీలాంకరైలో గల ఓ పోలింగ్‌ కేంద్రానికి విజయ్‌ తన ఇంటి నుంచి సైకిల్‌పై వచ్చారు. అనంతరం క్యూలైన్‌లో నిల్చుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ అభిమాన నటుడు సైకిల్‌పై కన్పించడంతో ఆశ్చర్యపోయిన అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇవి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగానే విజయ్‌ సైకిల్‌పై వచ్చినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. 



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని