BIG B: నా సాయం విలువ రూ.15కోట్లు
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BIG B: నా సాయం విలువ రూ.15కోట్లు

ముంబయి: ‘‘కరోనాపై పోరులో భాగంగా సుమారు రూ.15కోట్లు వరకూ విరాళంగా ఇచ్చాను’’అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అమితాబ్‌బచ్చన్‌. ఆయన కరోనా సహాయ చర్యల కోసం దిల్లీలోని గురుద్వారా కొవిడ్‌ సెంటర్‌కు రూ.2 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి పలువురు అమితాబ్‌బచ్చన్‌ మంచి మనసుని మెచ్చుకున్నారు. అదే సమయంలో సినిమా తారలు కొవిడ్‌ సహాయ కార్యక్రమాల్లో ముందుకు  రావడం లేదని, సరిగ్గా సహాయపడటం లేదంటూ కొందరు విమర్శించారు. దీంతో అమితాబ్‌బచ్చన్‌ స్పందించారు. ‘‘కరోనా బాధితులను ఆదుకోవడానికి నాకు సాధ్యమైనంతలో సాయం చేస్తూనే ఉన్నాను. చేసిన సాయం చెప్పుకోవడం అంటే చాలా ఇబ్బందికరం. నాకు చెప్పడం కంటే చేయడమే ఇష్టం. దిల్లీలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు నేను రూ.2 కోట్లు ఇవ్వడంపై చర్చ జరిగింది. కానీ కరోనా బాధితుల సహాయార్థం నేను సాయం చేసిన మొత్తం అంతా కలుపుకొంటే రూ.15 కోట్ల వరకూ ఉంటుంది. జుహూలో 25-50 బెడ్ల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిధులు ఇచ్చాను. చాలామంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందజేశాను. ముంబయిలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్‌ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్‌ పరికరాలు సమకూర్చాను. ఎంతోమంది పేద రైతుల్ని ఆర్ధికంగా ఆదుకున్నాను. ఇంత పెద్ద మొత్తం సాయం చేయడం నాకు కష్టమైనా సరే మరింతగా పనిచేశాను. ఇప్పటికే 20 వెంటిలేటర్లను విదేశీ కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చాను. వాటిలో పది ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగతా పది త్వరలో రానున్నాయి’’అంటూ తను చేసిన సేవలు చెప్పుకొచ్చారు అమితాబ్‌.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని