close

తాజా వార్తలు

Updated : 21/01/2021 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

దిల్లీ: పంచాయతీ ఎన్నికల అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం అందులో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. 

ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఈరోజు ఉదయం కీలక తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై ధర్మాసనం ఎదుట రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్‌ రిజర్వ్‌ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలు ఆపడానికి సహేతుక కారణాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఇవీ చదవండి..

ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు

జడ్జిలు మారినా న్యాయం మారదు: చంద్రబాబు

 



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని