ఆయన ఎంతో మందికి ఉపాధి ఇచ్చారు: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 06/06/2020 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన ఎంతో మందికి ఉపాధి ఇచ్చారు: చంద్రబాబు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖ నిర్మాత రామానాయుడును గుర్తు చేసుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా ట్వీట్లు చేశారు. రామానాయుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారని చెప్పారు. ‘భారతదేశంలోని 13 భాషల్లో.. అతి తక్కువ కాలంలో శతాధిక చిత్రాలను నిర్మించి.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన నిర్మాత రామానాయుడు గారు. మాజీ పార్లమెంటు సభ్యులుగా బాపట్ల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన సినీ రంగంలో సంపాదించిన డబ్బును.. తిరిగి అదే రంగం అభివృద్ధికే ఖర్చు చేసి.. ఎంతో మందికి ఉపాధినిచ్చారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం’ అని ట్వీట్‌ చేశారు.

ఇదే సందర్భంగా వెంకటేశ్‌ తన తండ్రితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నాకు ఎన్నో మధురజ్ఞాపకాల్ని మిగిల్చినందుకు ధన్యవాదాలు నాన్న. మిమ్మల్ని ఎప్పుడూ మిస్‌ అవుతున్నాం’ అని పేర్కొన్నారు.  ‘హ్యాపీ బర్త్‌డే తాత.. మిస్‌ యు..’ అంటూ రానా బాల్యంలో ఆయనతో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. అందులో నాగచైతన్య కూడా ఉన్నారు. ఇదే సందర్భంగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ రామానాయుడు అరుదైన ఫొటోల్ని షేర్‌ చేసింది.

ఫిలిం ఛాంబర్‌లో..

హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌ ఆవరణలో రామానాయుడు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సురేశ్‌బాబు, సి. కల్యాణ్‌, కె.ఎస్‌. రామారావు, అభిరామ్‌, కాజా సూర్యనారాయణ, జె.బాలరాజు తదితరులు ఇందులో పాల్గొన్నారు. విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని