గ్యాస్‌లీకేజీ బాధితులకు చంద్రబాబు లేఖలు
close

తాజా వార్తలు

Updated : 15/06/2020 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్యాస్‌లీకేజీ బాధితులకు చంద్రబాబు లేఖలు

అమరావతి : ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. విశాఖ తెదేపా నేతలు వ్యక్తిగతంగా కలిసి ఈ లేఖలను అందించనున్నారు. మృతుల కుటుంబాలకు సాంత్వనగా రూ.50 వేల ఆర్థిక సాయం కూడా ఇవ్వనున్నారు.

‘గ్యాస్‌ దుర్ఘటనలో 15 మంది మృతి చెందడం నా మనసును కలచివేసింది. వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందడం చూసి చలించిపోయాను. ఎల్జీ పాలిమర్స్‌ను వైకాపా ప్రభుత్వం వెనకేసుకురావడం విచారకరం. వ్యక్తిగతంగా పరామర్శించడానికి వైకాపా ప్రభుత్వం సహకరించలేదు. రాష్ట్ర ప్రజల కష్టనష్టాల్లో తెదేపా ఎప్పుడూ అండగా ఉంటుంది. బాధిత కుటుంబాలకు రూ.50 వేలు ఆర్థికసాయం బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని