తిరుపతి ప్రజల్లో ఆవేదన ఉంది: చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 16/04/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి ప్రజల్లో ఆవేదన ఉంది: చంద్రబాబు

తిరుపతి: ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగానని..  వైకాపా ప్రభుత్వంపై ఇక్కడి ప్రజల్లో ఎంతో ఆవేదన ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అప్పులు చేయడంలో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఇతర నిత్యావసరాల ధరలు పెంచేశారని.. వీటిపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. దేవాలయాల్లో దాడులు జరిగినా సీఎం పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.  అక్రమ కేసులు పెట్టి వేధించడంతోనే కర్నూలు జిల్లాలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేక చాలామంది వలసపోయారన్నారు.  రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నా సీఎం స్పందించడం లేదని.. డీఎన్‌డీ (డోంట్‌ డిస్టర్బ్‌) బోర్డు పెట్టారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేని సీఎంకు ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండే అర్హత లేదన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు తిండిపెట్టలేక వాటిని మూసివేసే పరిస్థితికి వచ్చారని.. ఏంటీ పరిపాలన? అని చంద్రబాబు మండిపడ్డారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని