శివాజీ టెర్మినస్‌: ఈ రైల్వేస్టేషన్‌ ప్రత్యేకతలు తెలుసా?
close

తాజా వార్తలు

Updated : 05/03/2021 04:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శివాజీ టెర్మినస్‌: ఈ రైల్వేస్టేషన్‌ ప్రత్యేకతలు తెలుసా?

ముంబయి: దేశవ్యాప్తంగా లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది రైల్వేశాఖ. దేశంలో ఒక్కో రైల్వేస్టేషన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే, మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌కు ఉన్న ప్రత్యేకతలే ఆ స్టేషన్‌కు గోల్డ్‌ సర్టిఫికేషన్‌ వచ్చేలా చేశాయి. సెంట్రల్‌ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఈ రైల్వేస్టేషన్‌ అత్యాధునిక హంగులతో పాటు, పర్యావరణానికి మేలు చేసేలా, ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పిస్తోంది. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇండస్ట్రీ ఇచ్చిన రేటింగ్స్‌ ప్రకారం మహారాష్ట్రలో గోల్డ్‌ సర్టిఫికేషన్‌ పొందిన  మొదటి రైల్వేస్టేషన్‌గా నిలిచింది.

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ ప్రత్యేకతలు

* సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాటు చేశారు.

* వాహనాల పార్కింగ్‌ ప్రదేశంలో ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నారు.

* మొత్తం స్టేషన్‌లో 15శాతం చెట్లు, చిన్న చిన్న పార్కులు, లాన్‌ను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ఆర్గానిక్‌ పద్ధతుల్లో పెంచుతున్నారు.

* స్టేషన్‌లో మొత్తంలో 245 కిలోవాట్ల సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు.

* స్టేషన్‌ మొత్తంలో 100శాతం ఎల్‌ఈడీలను అమర్చారు.

* స్టేషన్‌లో ఉన్న వివిధ ఆఫీస్‌లు, వెయిటింగ్‌ హాళ్లలో ఎక్కువగా సెన్సార్లు ఉపయోగించారు.

* ప్రతి చోటా బీఎల్‌డీసీ, హెచ్‌వీఎల్‌ఎస్‌ ఫ్యాన్స్‌ను అమర్చారు.

* ఎలివేటర్లు, ఫ్లాట్‌ఫామ్‌లు, స్టేషన్‌ ఏరియా, ట్రాక్స్‌, రూఫ్‌ టాప్‌లు, పార్కింగ్‌ ప్రాంతం, వెయింటింగ్‌ హాల్‌, షట్టర్స్‌ ఇలా ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి మెషీన్లు ఉన్నాయి.

* స్టేషన్‌ను శుభ్రం చేయడానికి బయో డీగ్రేడబుల్‌, ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్‌ను మాత్రమే ఉపయోగిస్తారు.

* వైఫై, పర్యాటక సమాచారం, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్లు, ఫార్మసీ, వైద్య సదుపాయం, ఆహారం ఇలా అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

* పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను వినియోగించవద్దంటూ స్టేషన్‌లో ప్రకటనలు కనిపిస్తాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని