మేము ఒప్పుకోం..!
close

తాజా వార్తలు

Updated : 26/03/2021 11:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేము ఒప్పుకోం..!

 క్వాడ్‌ను వ్యతిరేకించిన చైనా

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్వాడ్‌ కూటమిని చైనా వ్యతిరేకించింది. ఏమీ లేని చోట సమస్యలు సృష్టించవద్దని అమెరికాను హెచ్చరించింది. అంతేకాదు.. ఈ ప్రాంతంలో శాంతిని పెంపొందించే చర్యలు చేపట్టాలని హితవు పలికింది. ఈ మేరకు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ నేషనల్‌ డిఫెన్స్‌లోని సీనియర్‌ కర్నల్‌ రెన్‌గావ్‌కియాంగ్‌  పేర్కొన్నారు. అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జాక్‌ సులైవాన్‌ ఇటీవల చేసిన ప్రకటనకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘అమెరికా ప్రోత్సాహంతో మొదలైన చతుర్భుజ కూటమిని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని కొనసాగిస్తోంది. ఒక జట్టుగా పోరాడటాన్ని క్వాడ్‌ వ్యవస్థ నమ్ముతోంది. ఈ ప్రాంతంలోని దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. మేము దీనికి వ్యతిరేకం. శాంతి, అభివృద్ధితో ఇరుపక్షాలు లాభపడాల్సిన సమయం ఇది.  దీనికి వ్యతిరేకంగా ఏ ఒక్కరి అవసరాలో తీరేందుకు ఉపయోగపడాలని భావిస్తే అది విఫలం కావడం ఖాయం. ప్రపంచ శాంతి, అభివృద్ధికి చైనా కట్టుబడి ఉంది’’ అని రెన్‌ పేర్కొన్నారు.

ఇక ఇటీవల అమెరికా విడుదల చేసిన ఇండో-పసిఫిక్‌ వ్యూహపత్రంలో చైనాను ఆర్థిక, సైనిక పోటీదారుగా పేర్కొనడాన్ని రెన్‌ తప్పుబట్టారు. ‘‘అమెరికా కొత్త శత్రువులను తయారు చేసుకోవడం.. ముప్పుతో చెలగాటాలాడటం తప్ప ఏం చేసింది. తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి ఇలా చేస్తోంది. ఆ పత్రంలో ఈ విషయం స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. తన ఆధిపత్యం కొనసాగాలనే మొండితనంతో ఇలా వ్యవహరిస్తోంది. చైనా సైన్యానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకొనే శక్తి ఉంది. వారు దానికి కట్టుబడి ఉన్నారు’’ అని రెన్‌ మండిపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని