
తాజా వార్తలు
‘ఉక్కు’ ఆందోళనలో తెదేపా, వైకాపా బాహాబాహీ
కైకలూరు: ‘ఉక్కు’ ఆందోళన సందర్భంగా కృష్ణా జిల్లా కైకలూరులో వైకాపా, తెదేపా శ్రేణులు బాహాబాహీకి దిగారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కైకలూరులో తెదేపా, వైకాపా, వామపక్ష శ్రేణులు బంద్‌లో పాల్గొన్నాయి. అఖిలపక్ష ఆందోళనలో ఒకే పార్టీ ప్లెక్సీ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈక్రమంలో తెదేపా ఇన్‌ఛార్జి జయమంగళ వెంకటరమణ చేతిలో ఉన్న ప్లెక్సీని వైకాపా కార్యకర్తలు చించేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. వైకాపా శ్రేణుల తీరును నిరసిస్తూ జయమంగళ వెంకటరమణ, తెదేపా కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈఘటనతో కైకలూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇవీ చదవండి
Tags :